Vijay Antony: విజయ్ ఆంటోని అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే!

విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదట ఈ సినిమా టైటిల్ ను చూసి నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లు సినిమా చూసిన తర్వాత ఈ మూవీకి ఇదే సరైన టైటిల్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిచ్చగాడు2 సినిమా ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు ఈ ట్రైలర్ డిఫరెంట్ గా ఉందని ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఏ సీన్లు హైలెట్ గా నిలిచాయో సెకండ్ పార్ట్ లో కూడా ప్రేక్షకులను మెప్పించే సన్నివేశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కామెంట్లు (Vijay Antony) విజయ్ ఆంటోని అభిమానులకు నచ్చుతున్నాయి.

బిచ్చగాడు2 సినిమా ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గత కొంతకాలంగా విజయ్ ఆంటోనికి సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. కెరీర్ విషయంలో విజయ్ ఆంటోని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్ ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

బిచ్చగాడు2 సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఆంటోని సినిమాలు ఇతర హీరోలకు భిన్నంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల సక్సెస్ రేట్ మళ్లీ తగ్గుతున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని కెరీర్ పుంజుకునేలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సి ఉంది. విజయ్ ఆంటోని టాలెంట్ కు తగిన సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus