Vijay Antony: విడాకులకు సిద్ధమైన విజయ్ ఆంటోని.. ఆ పోస్టుకు అర్థం అదేనా?

ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో విడాకులు మరింత కామన్ అయిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లుగా కూడా విడాకులు తీసుకొని ఒకరికి ఒకరు దూరమవుతున్నారు. టాలీవుడ్ లో సమంత నాగచైతన్య, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య ధనుష్ జంట విడాకులు తీసుకోవడం ఇప్పటికి హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల మరొక కోలీవుడ్ స్టార్ హీరో విడాకులు సిద్ధమైనట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు పొందిన విజయ్ ఆంటోనీ “బిచ్చగాడు” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇదిలా ఉండగా విజయ్ తన భార్యతో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆమెకు విడాకులు ఇవ్వటానికి సిద్ధపడినట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విజయ్ ఆంటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తోంది.

ఎప్పుడు తన సినిమాలకు సంబంధించిన పోస్టులు మాత్రమే షేర్ చేసే విజయ్ అంటోని ఇటీవల ట్విట్టర్ లో ” కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు మూడో వ్యక్తిని రానియ్యకుండా మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ సమస్యలను పరిష్కరించడానికి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తే వారు మీ జీవితాన్ని నాశనం చేసి ఆనందిస్తారు” అంటూ పోస్ట్ షేర్ చేశాడు. ఈ విధంగా విజయ్ విజయ్ చేసిన పోస్ట్ ద్వారా తనకు తన భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఈయన కూడా విడాకులు ఇవ్వబోతున్నారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది.

అయితే విజయ్ ఓ సినిమా నిమిత్తం తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus