Vijay: మీ కాళ్లకు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను: విజయ్‌

దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి వస్తాడా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు.. దానికి ఆయన నుండి సమాధానం కూడా రావడం లేదు. దీంతో విజయ్‌ మనసులో ఏముంది అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు, రాజకీయ ఆసక్తిపరులు ఇలా చాలామంది వెయిట్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయ్‌ నుండి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే అది హాఫ్‌ క్లారిటీ మాత్రమే. ఆయన ఏదో చెప్పారు కానీ.. దేని గురించి అన్నారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

విజయ్‌, లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లియో’. దసరాకు విడుదలైన ఈ సినిమా విజయోత్సవాన్ని చిత్రబృందం ఇటీవల నిర్వహించింది. ఈ క్రమంలో విజయ్‌ తన అభిమాలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో ‘‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు, వేరే ఉంది. ఆ లక్ష్యం చాలా గొప్పది. మనం ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో అదరికీ చూపిద్దాం’’ అని మాట్లాడాడు (Vijay) విజయ్‌. ఇప్పుడు అవే మాటలు వైరల్‌ అవుతున్నాయి.

తమిళనాడులో వివిధ ప్రాంతాల నుండి దాదాపు 10 వేల మందికి పైగా అభిమానులు ‘లియో’ సినిమా విజయోత్సవానికి తరలివచ్చారు. సినిమా గురించి విజయ్‌ మాట్లాడతాడు, ఎప్పటిలానే మిగిలిన విషయాలు మాట్లాడడు అని అనుకున్నారు కొందరు. అయితే విజయ్‌ అలా మాట్లాడేసరికి ఇదేంటి విజయ్‌లో ఈ మార్పు, రాజకీయాల గురించే ఇలా అన్నాడా అనేది అర్థంకావడం లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్‌ అయితే అవి పొలిటికల్‌ మాటలే అంటున్నారు.

‘‘నాపై ఇంత అభిమానం చూపిస్తున్న మీ కోసం ఏదైనా చేయాలనుంది. చేస్తా. అవసరమైతే మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను. ఇప్పుడు ఏం జరిగినా పట్టించుకోవద్దు, కాస్త ఓపిక పట్టండి’’ అంటూ తనపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడాడు విజయ్‌. అయితే ఈ వ్యాఖ్యలు రజనీకాంత్‌ను ఉద్దేశించి పరోక్షంగా చేసినవే అని ఓ కామెంట్‌ కూడా వినిపిస్తోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags