విజయ్ నీ వెనకాలే నడిచి వస్తాం అంటున్న అమ్మాయిలు

అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిన విజయ్ దేవరకొండ, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ పై నోటా లాంటి డిసాస్టర్ సినిమా వచ్చినా తన క్రేజ్ ఏ మాత్రం చెదరలేదు.ఆ పై టాక్సీవాలా సినిమా విడుదలకు ముందే సినిమా మొత్తం లీక్ అవడం, ఆ లీక్ అయిన సినిమా చూసిన కొందరు నెగటివ్ టాక్ చెప్పడం తో ఆ సినిమా విజయం సాధించడం మీద కొన్ని అనుమానాలు వెలువడినా అవన్నీ పటాపంచలు చేస్తూ టాక్సీవాలా సినిమా విజయం సాధించడం తో మంచి ఊపు మీద ఉన్నాడు ఈ యూత్ స్టార్.

ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ క్రేజ్ మామూలు గా లేదు. మహేష్, ప్రభాస్ తరువాత ఆ రేంజ్ లో అమ్మాయిల ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ నే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.తన క్రేజ్ ను ఎప్పటికపుడు హై లో ఉండేలా చూసుకోవడం లో విజయ్ దిట్ట. ఒకపుడు హిందీ ఇండస్ట్రీ లో ఇలాగా ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు రీమిక్స్ వీడియో లు చాల పాపులర్, అయితే ఆ తరువాత వాటికి క్రేజ్ తగ్గి అలంటి ప్రయోగాలు బాగా తగ్గిపోయాయి. ఐతే ఎపుడు కొత్తదనాన్ని కోరుకునే విజయ్ ఇపుడు ఆ సంస్కృతి ని మళ్ళీ తెర పైకి తెస్తూ ఒక ప్రైవేట్ సాంగ్ వీడియో సాంగ్ లో కనిపించాడు. అద్భుతమైన విజువల్స్ కి తోడు చూడచక్కని హీరోయిన్ మాలోబిక నటియించిన ఈ వీడియో కి విశేష స్పందన లభిస్తుంది. చిన్మయి పాడిన ఈ సాంగ్ లో విజయ్ ఆధ్యంతం తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus