Vijay Devarakonda, Ananya Pandey: అనన్య విషయంలో నాకు నచ్చినది అదే: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే దేశంలో పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గుంటూరులో ఎంతో ఘనంగా ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే.

విజయ్ దేవరకొండ అనన్య పాండే ఇద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అనన్య పాండే గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అనన్య విషయంలో తనకు నచ్చనిది ఓ విషయం ఉందని అసలు విషయం బయటపెట్టారు. అనన్య నిత్యం ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. ఇదే తనలో నాకు నచ్చని విషయం అంటూ ఈయన తెలియజేశారు. ఇలాంటి అల్లరి పిల్ల నాకు కనక పుడితే ఏం చేయాలో అని భయం వేస్తుంది

అంటూ ఈ సందర్భంగా అనన్య పాండే గురించి విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడు అనన్య పాండే ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈమె అల్లరిని భరిస్తున్నటువంటి ఈమె తల్లిదండ్రులకి నేను సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా అనన్య పాండే గురించి రౌడీ హీరో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రౌడీ హీరోకి మీ దృష్టిలో రియల్ ఫైటర్ అంటే ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఎవరైతే జీవితంలో గౌరవం డబ్బు ప్రేమ వంటి వాటికోసం పోరాటం చేస్తారో వారే రియల్ ఫైటర్ అంటూ ఈ సందర్భంగా ఈయన సమాధానం చెప్పారు. మొత్తానికి లైగర్ చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus