రవితేజకి అడ్డుపడుతున్న విజయ్ దేవరకొండ

ట్యాలెంట్ ఫ్రంట్ ప్యాకెట్ లో .. అదృష్టాన్ని బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకుని ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. అతను చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు ఆశించిన దానికన్నా ఎన్నో రేట్లు విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం క్రేజీ హీరోల జాబితాలో ముందువరుసలో ఉన్నారు. అలాగే కొంతమంది యువ హీరోలకు అతను గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ తోను పోటీ పడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అదెలా అంటే.. రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నారు.

ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5 న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ .. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా సినిమాలో నటిస్తున్నాడు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాని జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న నోటాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి అక్టోబ‌ర్ 4న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఇలా రిలీజ్ చేస్తే రవితేజ సినిమాపై ప్రభావం ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ క్రేజ్ దెబ్బకి రవితేజ సినిమా కలక్షన్స్ తగ్గవచ్చని అంటున్నారు. ఒక విధంగా రవితేజ విజయానికి విజయ్ అడ్డు పడుతున్నట్టే అవుతుందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus