విజయ్ దేవరకొండ ‘రౌడీ’ కాదు.. ‘హీరో’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాధికా హీరోయిన్ గా వచ్చిన ‘హీరో’ చిత్రం అప్పట్లో ఒక సూపర్ హిట్. ఇప్పుడు అదే టైటిల్ తో ఒక సినిమా రాబోతోంది. ఇంతకీ ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా.. ? ఇంకెవరు.. మన సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండే. విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో మరో చిత్రం లైన్లో పెట్టాడు. తాజాగా ఓ ద్విభాషా చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్టు సమాచారం. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే ‘హీరో’ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus