Vijay Devarakonda: రొమాంటిక్ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ… వీడియో వైరల్!

విజయ్ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మోస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసినటువంటి పోస్టర్స్ భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నాయి.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ కూడా మంచి ట్రెండ్ అవుతున్నాయి. ఈ విధంగా ఈ సినిమా భారీ అంచనాలనే పెంచుతుందని చెప్పాలి. మరోవైపు నటుడు విజయ్ దేవరకొండ సైతం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా సమంతతో ఉన్నటువంటి ఒక రొమాంటిక్ వీడియోని షేర్ చేశారు.

ఆరాధ్య ఆరాధ్య అంటూ సాగే ఈ పాటలోని ఒక రొమాంటిక్ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి విజయ్ దేవరకొండ మన ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరియర్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.దాదాపు సమంత పరిస్థితి కూడా అలాగే ఉంది అయితే వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus