Vijay Devarakonda: మోస్ట్‌ వైలెంట్‌ దర్శకుడి కొత్త సినిమా.. తెరపైకి కొత్త హీరో!

Ad not loaded.

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు ‘కింగ్‌డమ్‌’  (Kingdom)  అనే సినిమా చేస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ తొలుత రామ్‌చరణ్‌ (Ram Charan)  దగ్గరకు వెళ్లింది. త్వరలో సినిమా ప్రారంభం అనగా ఆ సినిమాను పక్కన పెట్టేశాడు చరణ్‌. కథ నచ్చలేదు అని తొలుత వార్తలొచ్చినా.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  పనులు పూర్తి కాకపోవడం వల్లనే అని రీసెంట్‌గా తెలిసింది. ఆ సినిమా అలా విజయ్‌ దేవరకొండ దగ్గరకు వచ్చింది. అప్పుడు సినిమా వస్తే ఇప్పుడు రూమర్‌ వచ్చింది.

Vijay Devarakonda

‘కింగ్‌డమ్‌’ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ చేయనున్న సినిమాల లిస్ట్‌లో ఓ హిందీ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ వచ్చి చేరింది. నిజానికి విజయ్‌ లైనప్‌ మీద ఇప్పటికే స్పష్టత ఉంది. రాహుల్‌ సాంకృత్యాన్‌ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ సినిమా ఉండగా.. రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో మరో సినిమా ఉన్నాయి. ఈ రెండూ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే విజయ్‌ మరో సినిమా విషయమై చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

గతేడాది ‘కిల్‌’  సినిమాతో బాలీవుడ్‌ సినీ జనాల దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు నిఖిల్‌ నగేశ్‌ భట్‌. ఆయన రీసెంట్‌గా విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లవ్‌ – యాక్షన్‌ బేస్డ్‌ కథను నిఖిల్‌ సిద్ధం చేసుకున్నారని, దీనికి సంబంధించి కథా చర్చలు మొదలయ్యాయని అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ఉంటుంది అని కూడా చెబుతున్నారు. కరణ్‌ ప్రోత్సాహంతోనే విజయ్‌ను నిఖిల్‌ కలిశారు అని టాక్‌.

‘లైగర్‌’ సినిమా నేపథ్యంలో విజయ్‌ – కరణ్‌కి మంచి అనుబంధం ఉంది. మరోవైపు నిఖిల్‌ అంటే కరణ్‌కు అభిమానం. ఈ క్రమంలో నిఖిల్‌ – విజయ్‌ కాంబో కుదిరేలా ఉంది. ఒకవేళ కుదిరితే పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమా రూపొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా వరుసలో వస్తుందా? లేక లూప్‌ లైన్‌లో ముందుకు తీసుకొచ్చి చేస్తారా అనేది విజయ్‌ చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus