బేర్ బాడీతో బిగ్ బాస్ షో లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్

మొన్నామధ్య విజయ్ దేవరకొండ వరుసబెట్టి ఓ నాలుగైదు రోజులు షర్ట్ లేకుండా ఒక ఫోటో సిరీస్ పోస్ట్ చేసి వైరల్ అయ్యాడు. తొలుత అదేదో సినిమా కోసం అనుకొన్నారు కానీ.. ఆ తర్వాత ఆ హడావుడి మొత్తం తాను స్వంతంగా లాంచ్ చేసుకొన్న “రౌడీ క్లబ్” అనే బట్టల బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసమని అర్ధమైంది. సినిమాలతోపాటు బిజినెస్ ను కూడా చాలా సీరియస్ గా తీసుకొన్న విజయ్ దేవరకొండ “రౌడీ క్లబ్” ప్రమోషన్ ను కాస్త గట్టిగా చేయనున్నాడు.

అందుకోసమే.. “బిగ్ బాస్ 2″లోకి ప్రదీప్ మార్చిరాజు తరహాలో ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. తన బ్రాండ్ ప్రమోషన్ కాబట్టి, నీట్ గా బట్టలేసుకొని కాకుండా డిఫరెంట్ గా షర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ షోలో తన రౌడీ బ్రాండ్ ను అందరికీ ఎక్స్ ప్లేన్ చేసి అక్కడ షర్ట్ లేదా టీషర్ట్ వేసుకోనున్నాడు. ఈ ప్రమోషన్స్ విజయ్ తాజా చిత్రమైన “గీత గోవిందం” చిత్రానికి కూడా ప్లస్ అవ్వనున్నాయి. మాములుగానే రెచ్చిపోయే విజయ్ దేవరకొండ.. ఇక బిగ్ బాస్ షోలో చేసే రచ్చ చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus