Vijay Devarakonda: బోయపాటి – గీతా ఆర్ట్స్‌… ఎంతకీ తేలని లెక్క ఇది! ఎందుకని?

మాస్‌ కాంబో ఈజ్‌ బ్యాక్‌ అంటూ కొన్ని రోజుల క్రితం గీతా ఆర్ట్స్‌ ఓ సినిమాను అనౌన్స్‌ చేసింది. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో సినిమా ఉండబోతోంది అనేది ఆ పోస్ట్‌ సారాంశం. అయితే అందులో హీరో ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో ఎవరవ్వొచ్చు అంటూ రోజుకో వార్త బయటికొస్తోంది. అల్లు అర్జునా, బాలకృష్ణనా అంటూ ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్‌. ఇప్పుడు మూడో హీరోగా విజయ్‌ దేవరకొండ పేరు బయటకు వచ్చింది.

నిజానికి గీతా ఆర్ట్స్‌లో బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘సరైనోడు’ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుంది అన్నారు. కానీ ఎందుకో ఇంతవరకు మెటీరియలైజ్‌ కాలేదు. ఇదిగో, అదిగో అంటూ కొన్ని రోజులు.. ఆ హీరోనే, ఈ హీరోనే అంటూ మరికొన్ని రోజులు అన్నారు. దాంతో ఈ కాంబో గురించే జనాలు వదిలేశారు. అయితే అనూహ్యంగా ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఆ సినిమాలో హీరోగా విజయ్‌ దేవరకొండను దింపే ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు.

ఎందుకంటే, విజయ్‌ కూడా గీతా ఆర్ట్స్‌ వాళ్లకు ఓ సినిమా చేయాలి. ‘గీత గోవిందం’ తర్వాత అనుకున్న కాంబో ఇది. అప్పటి నుండి వర్కౌట్‌ కావడం లేదు. దీంతో రెండు లాంగ్ పెండింగ్‌ కాంబోలను కలిపి ట్రయోను సిద్ధం చేయాలని అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేస్తున్నారట. అయితే మరీ ఊరమాస్‌ పాత్రలు విజయ్‌కి నప్పడం లేదు. లవర్‌ బాయ్‌, ఫ్యామిలీ కథలే ఆయన ఫ్యాన్స్‌కి నచ్చుతున్నాయి. ‘లైగర్‌’ ఫలితం చూశాం కదా. దీంతో ఇప్పుడు బోయపాటి నుండి కూడా అలాంటి కథే వస్తే కష్టమే.

ఒకవేళవ విజయ్‌ (Vijay Devarakonda) కూడా ఈ ప్రాజెక్ట్‌లో సెట్‌ కాకపోతే గతంలో అనుకున్న సూర్యను తీసుకొస్తారని చెబుతున్నారు. అయితే సూర్య ఇప్పటికిప్పుడు డేట్స్‌ ఇచ్చే పరిస్థితి లేదు. వరుస పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లు పట్టుకుని ఉన్నాడు. కాబట్టి గీతా ఆర్ట్స్‌ వాళ్లకు ఈ ప్రాజెక్ట్‌ అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus