Vijay Devarakonda: థియేటర్ ఓనర్ తో ఫోటో.. విజయ్ మారాడట!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమాతో భారీ మొత్తంలో నష్టాలు ఖాయమని తేలిపోయింది. విజయ్ దేవరకొండ బిహేవియర్ వల్లే లైగర్ సినిమా ఈ రేంజ్ లో ఫ్లాపైందని కామెంట్లు వినిపించాయి. తాజాగా ఒక థియేటర్ ఓనర్ విజయ్ దేవరకొండపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారనే సంగతి తెలిసిందే.

థియేటర్ ఓనర్ విజయ్ దేవరకొండను అనకొండ అని కామెంట్లు చేశారు. ముంబై థియేటర్ ఓనర్ అయిన మనోజ్ దేశాయ్ చేసిన కామెంట్లు విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో విజయ్ దేవరకొండ డైరెక్ట్ గా వెళ్లి ఆయనను కలిసి ఫోటో దిగారు. తనపై ప్రేక్షకులలో ఉన్న నెగిటివిటీని తగ్గించుకునే దిశగా విజయ్ దేవరకొండ అడుగులు వేస్తుండటం గమనార్హం. విజయ్ తనను కలవడంతో మనోజ్ దేశాయ్ కూడా శాంతించారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానని ఆయనకు చెప్పారని తెలుస్తోంది.

ఆవేశంలో తను చేస్తున్న కామెంట్ల వల్ల సినిమాలకు నష్టం కలుగుతోందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారని బోగట్టా. లైగర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా విజయ్ దేవరకొండ మాత్రం తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. లైగర్ ఫ్లాప్ విషయంలో పూరీ జగన్నాథ్ ను ఎక్కువమంది నిందిస్తుండటం గమనార్హం.

మరోవైపు మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండ విషయంలో శాంతించడంతో అనకొండ ఇప్పుడు బంగారు కొండ అయ్యాడంటూ కొంతమంది నెటిజన్లు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు విజయ్ దేవరకొండకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus