Vijay Deverakonda: ఆనంద్ దేవరకొండ కెరీర్ గురించి విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం.. పలు సినిమాల్లో హీరోగా నటించి ‘బేబీ’ తో హిట్ అందుకోవడం జరిగింది.’మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే ఓటీటీ హిట్ కూడా ఇతని ఖాతాలో ఉంది. ఇప్పుడు ఇతను కూడా హీరోగా బిజీ అవుతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఇతను 2 సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడితో కాగా ఇంకోటి ’90’S బయోపిక్'(వెబ్ సిరీస్) కి సీక్వెల్ కావడం విశేషం. అయితే ఇతని కెరీర్ గురించి తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు అన్నట్టు విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Vijay Deverakonda

ఆనంద్ గురించి విజయ్ మాట్లాడుతూ.. “సినిమాల విషయంలో నా తమ్ముడు ఆనంద్ కి ఎలాంటి హెల్ప్ చేయను. సలహాలు, సూచనలు వంటివి కూడా ఇవ్వను. తమ్ముడనే కాదు ఆ ప్లేస్ లో నా కొడుకు ఉన్నా సరే ఇలాగే వ్యవహరిస్తాను. ఆనంద్ తన సినిమాలు ఒప్పుకునే టైంలో ‘ఆ దర్శకుడితో పలానా బ్యానర్లో సినిమా చేస్తున్నాను’ అని చెబుతాడు. నేను కూడా అక్కడివరకే ఉంటాను.అంతకు మించి కథ ఏంటి? వంటి విషయాలు కూడా అడగను.

ఇక్కడ ఎక్స్పీరియన్స్ ద్వారా లెర్నింగ్ అనేది ముఖ్యం. నా తమ్ముడు సినిమాల విషయాల విషయంలో చేసే పొరపాట్లను సరిదిద్దుకోవాలి. అదే కోరుకుంటాను. నటుడిగా రాణించడం అనేది ఈజీ కాదు అని నాకు తెలుసు. కాకపోతే పక్కవాళ్ళ కామెంట్స్ ను పట్టించుకోవద్దు అని మాత్రం చెబుతాను.మొదట్లో కష్టపడినా ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాడు.మంచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

విజయ్‌ – గౌతమ్‌ కాంబినేషన్‌ ఓసారి మిస్ అయ్యాం.. ఏ సినిమానో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus