ఎప్పుడో “నువ్విలా” అనే సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసి అనంతరం “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” మూవీలో మరో పాత్ర పోషించినప్పటికీ రాణి గుర్తింపు ఒక్క “అర్జున్ రెడ్డి“తో సంపాదించుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో విజయ్ యాటిట్యూడ్, యాస, భాష అందర్నీ, ముఖ్యంగా యువతని అమితంగా ఆకట్టుకొన్నాయి. దాంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే.. ఆ సక్సెస్ స్ట్రీక్ ను అదే తరహాలో కంటిన్యూ చేయాలంటే ఇమ్మీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసేలా కాదు కదా కనీసం మంచి నటుడు అని కూడా అనిపించుకోలేకపోతున్నాడు.
అందుకు నిదర్శనం ఇవాళ విడుదలైన “మహానటి” చిత్రం. ఈ చిత్రంలో 1980లలో క్రిస్టియన్ కుర్రాడిగా నటించిన విజయ్ దేవరకొండ నటన పరంగానే కాక డైలాగ్ డెలివరీతోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరి ఇలాగే కంటిన్యూ అయితే విజయ్ యారోగెంట్ రోల్స్ కి తప్ప వేరే పాత్రలకి పనికిరాడేమోననే ఇమేజ్ ను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. విజయ్ తదుపరి చిత్రం “ట్యాక్సీవాలా”లోనూ ఇంచుమించు అర్జున్ రెడ్డి తరహా పాత్రలోనే కనిపించనున్నాడు. ఒక్క పరశురామ్ సినిమాలో మాత్రమే పద్ధతిగల యువకుడిగా నటించనున్నాడు. “డియర్ కామ్రేడ్”లోనూ మనోడిది యాంగ్రీ యంగ్ మేన్ క్యారెక్టరేనట. సొ, మిస్టర్ విజయ్ దేవరకొండ ఇకనైనా తమరు యాంగర్ షోయింగ్ స్కిల్స్ కంటే వివిధమైన యాసల్లో డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్ ప్రెషన్స్ విషయంలో వేరియేషన్స్ చూపించకపోతే నటుడిగా సర్వైవ్ అవ్వడం కష్టమే.