విజయ్ దేవరకొండ అనారోగ్యం పాలైనట్టు కొన్ని గంటల నుండి టాక్ నడుస్తుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వస్తున్న ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట. విజయ్ కి ఓపిక లేక చాలా నీరసంగా ఉండటం వల్లే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందని, ఆకలి లేకపోవడంతో ఎటువంటి ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు టాక్ నడిచింది. ఈ విషయంలో క్లారిటీ లేక… నిజానిజాలు తెలియక అభిమానులు కంగారు పడుతున్నారు.
అయితే విజయ్ టీం ప్రకారం.. పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదని తెలుస్తుంది. సీజనల్ ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు అందరికీ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. విజయ్ కి కూడా అలాంటి జ్వరమే అని.. 4 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
మరోపక్క విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న విడుదల కానుంది.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ నిర్మాత. ఈ సినిమా మార్చి నెలలోనే రిలీజ్ కావాలి. కానీ సకాలంలో షూటింగ్ పూర్తవ్వకపోవడం, అలాగే ‘హరిహర వీరమల్లు’ సినిమా వల్ల కూడా వాయిదా వేశారు.
మొత్తానికి మరో 2 వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్య శ్రీ బోర్సే ఇందులో హీరోయిన్. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన సాంగ్స్, గ్లింప్స్ వంటి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సత్య దేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.