Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

‘జబర్దస్త్’ స్టార్ట్ అయ్యి 12 ఏళ్ళు అవుతుందట. దీని కోసం అనసూయని మళ్ళీ తీసుకొచ్చింది ‘జబర్దస్త్’ టీం. 2013లో ‘జబర్దస్త్’ మొదలైతే 2022 వరకు హోస్ట్ గా వ్యవరించింది అనసూయ. 2022 లో ఆమె ఈ షో నుండి తప్పుకుని సినిమాల్లో బిజీ అయ్యింది. అందుకే కొత్త ఎపిసోడ్ కు అనసూయ స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

Anasuya

అయితే అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి ఆమెపై కొందరు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టడమే అని ఓ సందర్భంలో తెలిపింది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే అది హైపర్ ఆది అని ఆమె పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోను గమనిస్తే.. నాగబాబు గారు, ఇంద్రజ గారు ‘నేను వెళ్లే ముందు ఎంత అడుక్కున్నానో తెలుసా? ‘ఆది వద్దు ఆది వద్దు’ అని..! నేను ఏమున్నా మైకులోనే చెప్పేస్తూ ఉంటా.

నీతో పాటు స్కిట్ చేసి ఎంకరేజ్ చేసినా నా ఎక్స్క్లూజివిటి ఏడవలేదు? అది నా ఏడుపు’ అంటూ ఆమె ఎమోషనల్ గా ఏదో చెబుతుంది. తర్వాత ‘నువ్వు అమెరికా వెళ్లినా లింకులు పంపించా.. అది రా మన లింకు’ అంటూ హైపర్ ఆది తర్వాత తన శైలిలో ఏదో డైలాగ్ వేశాడు.

అందుకు అనసూయ.. ఇదిగో ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్ళిపోయింది’ అంటూ అనసూయ.. సీరియస్ డైలాగ్ కొట్టింది. అలా ఈ ప్రోమో రసవత్తరంగా సాగింది. మరి ఫుల్ ఎపిసోడ్ చూస్తేనే తప్ప.. వాటి ఫుల్ మీనింగ్ అండ్ ఒపీనియన్స్ తెలీవు. మొత్తానికి నెక్స్ట్ ఎపిసోడ్ పై ఈ ప్రోమో ఆసక్తి కలిగించింది అని చెప్పాలి.

 దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus