Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

మా సినిమా స్పాన్‌ చాలా పెద్దది. ఒక్క పార్టులో కథను చెప్పలేం.. ప్రేక్షకుల్ని సంతృప్త పరచలేం అంటూ మన దర్శకులు ఈ మధ్య సినిమాలను రెండు ముక్కలు చేస్తున్నారు. అందులో ఒకటి బాగా ఆడితే.. ఇంకొటి ఆటోమేటిగ్గా ఆడేస్తుంది. ఇలాంటి రెండు ముక్కలాటకు ఆధ్యుడు అంటే దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళినే. ‘బాహుబలి’ సినిమాను కొంచెం సాగదీసి (ఇలా ఎందుకన్నామో ఆఖరున చెబుతాం) రెండు ముక్కలు చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’గా వచ్చిన రెండు సినిమాలను ఇప్పుడు ఒక సినిమాగా (బాహుబలి: ది ఎపిక్‌) మార్చి అక్టోబరులో రిలీజ్‌ చేస్తామని అంటున్నారు.

Pan-India Movies

దీనికి ఓ కొత్త ట్రెండ్‌ అని కూడా పిలుస్తున్నారు. మరి ఈ కొత్త ట్రెండ్‌ని ఇతర దర్శకులు ఫాలో అవుతారా? ఏమో గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఫాలో అయ్యేలానే ఉన్నారు. తెలుగు, తమిళంలో గత కొన్నేళ్లలో కొన్ని రెండు ముక్కల సినిమాలు వచ్చాయి. తెలుగులో ఈ స్టైల్‌లో ఒక సినిమాగా మార్చాలి అంటే ‘యన్టీఆర్‌: కథానాయకుడు’, ‘యన్టీఆర్‌: మహా నాయకుడు’ అంటూ ఎన్టీఆర్‌ జీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు క్రిష్ – హీరో బాలకృష్ణ. ఇప్పుడు రెండింటినీ కలిపి క్రిస్ప్‌గా ‘యన్టీఆర్‌’ అని తీసుకురావొచ్చు.

ఆ తర్వాత ఇలాంటి ప్రయత్నం తమిళనాట నుండి వచ్చింది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను రెండు ముక్కలు చేసి విడుదల చేశారు. తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌ రెండో భాగానికి రాలేదు. ఇప్పుడు రెండూ కలిపి రీరిలీజ్‌ చేస్తే మరో ఛాన్స్‌ వస్తుంది. ఇక ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీయఫ్‌’ విషయంలో కూడా ఈ తరహా ప్రయత్నం చేయొచ్చు. రెండు భాగాల్లో కొన్ని అక్కర్లేని సీన్స్‌, డ్రామా ఉంది. కాబట్టి ఒక ముక్క చేయడం కష్టం కాదు. అయితే మూడో ‘కేజీయఫ్‌’ తీస్తామని అప్పట్లో చెప్పారు కాబట్టి ఇప్పుడు రెండూ కలపకపోవచ్చు.

ఇక ‘పుష్ప’రాజ్‌ హంగామాను కూడా కలిపి చూపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రెండు పార్టుల్లోనూ పారలల్‌ రన్నింగ్ సీన్స్‌ ఉంటాయి. మరి లెక్కల మాస్టారు లెక్కల్లో రెండూ కలపాలనే ఆలోచన ఉందో లేదో చూడాలి. ఆయన ఏదైనా కొత్తగా చేద్దామంటే కలిపేయొచ్చు. అయితే మూడో ముక్క కూడా ఉందని ఎండ్‌ టైటిల్స్‌లో వేయడం వల్ల ఈ సంగతీ చెప్పలేం. ఒక వేళ వీరు ఓకే అనుకుంటే మళ్లీ ఈ సినిమాలు ‘బాహుబలి’ సినిమాలా ఎడిటింగ్‌ టేబుల్‌ మీదకు వస్తాయి.

సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus