టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులంతా రౌడీ అని పిలుచుకునే ఈ హీరో గారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ హీరోకి ఆఫర్లు వస్తున్నాయి. పూరి డైరెక్షన్ లో విజయ్ నటిస్తోన్న ‘ఫైటర్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఓ పక్క తన సినిమాలతో కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు హోస్ట్ గా మరింత పాపులారిటీ పెంచుకోబోతున్నాడు.
ప్రస్తుతం చాలా మంది స్టార్లు హోస్ట్ లుగా మారి టీవీ షోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ సీజన్ 1ని హోస్ట్ చేశారు. ఇక నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లు కూడా బుల్లితెరపై ఎంటర్టైనర్ చేశారు. నాగ్ ఇంకా హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా సమంత కూడా ‘సామ్ జామ్’ అంటూ హోస్ట్ గా అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు వీరి రూట్ లోనే విజయ్ దేవరకొండ కూడా ఓ షోని హోస్ట్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇండియాలో పాపులర్ హిప్ హాప్ డాన్స్ షో ‘షఫుల్’ నాల్గో సీజన్ వచ్చే ఏడాది నుండి ప్రారంభం కానుంది.
దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ ను వెలికితీయడమే ఈ షో ప్రధాన ఉద్దేశం. ఈ షోకి విజయ్ దేవరకొండ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటివరకు డాన్స్ ప్రధానంగా నడిచిన ఈ షోలో ఈసారి డాన్స్ తో పాటు ఆర్ట్, మ్యూజిక్ వంటి కళారూపాల్లో కూడా పోటీలుంటాయని తెలుస్తోంది. ఈ షోకి విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ ‘1 నేనొక్కడినే’ ఫేమ్ కృతిసనన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. ఈ షోలో పాల్గొనడానికి డిసెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనవరి 17నుండి ఆడిషన్స్ జరుగుతాయట. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి రూ.20 లక్షల నగదు బహుమతి ఉంటుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?