Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’(Akhanda 2) బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. డిసెంబర్ 12న రిలీజైన ఈ సీక్వెల్.. మొదటి రోజే రికార్డు పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా ఇందులో దైవభక్తి, దైవశక్తి, సనాతన ధర్మం ఎలిమెంట్స్ ఆడియెన్స్‌కి నచ్చాయి. బాలయ్యతో పాటు సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి వంటి భారీ క్యాస్టింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

Akhanda 2

అయితే సినిమాలో బాలయ్య ఉగ్రరూపం ఒకెత్తయితే.. క్లైమాక్స్‌కి ముందు వచ్చే శివుడి ఎపిసోడ్ మరో ఎత్తు. అఖండ తల్లి చనిపోయినప్పుడు సాక్షాత్తు ఆ పరమ శివుడే దిగివచ్చి తలకొరివి పెట్టే సీన్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.. అలాగే థియేటర్లలో కొంతమందికి గూస్‌బంప్స్ తెప్పించింది అని చెప్పాలి.శివుడు స్క్రీన్‌పై కనిపించేది కాసేపే అయినా, తన అప్పియరెన్స్‌తో మెస్మరైజ్ చేశాడు ఆ పాత్ర పోషించిన నటుడు.

దీంతో సినిమా చూసి బయటకొచ్చిన ప్రతీ ఒక్కరూ ఆ శివుడి పాత్రధారి గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ శివుడి పాత్రలో నటించింది ఎవరంటే.. బాలీవుడ్ నటుడు తరుణ్ ఖన్నా. మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, హిందీ సీరియల్స్ చూసేవారికి ఈయన సుపరిచితుడే. తరుణ్ ఖన్నాకి శివుడి గెటప్ వేయడం కొత్తేమీ కాదు.

గతంలో ‘సంతోషి మా’, ‘రాధాకృష్ణ’, ‘నమః’, ‘దేవి ఆది పరాశక్తి’, ‘శ్రీమద్ రామాయణ్’ వంటి పాపులర్ సీరియల్స్‌లో ఆయన శివుడిగా నటించి మెప్పించారు. ఆ అనుభవమే ఇప్పుడు ‘అఖండ 2’లో ఆ పాత్ర అంత బాగా రావడానికి హెల్ప్ అయ్యింది. బుల్లితెరపై శివుడిగా ఆకట్టుకున్న తరుణ్.. ఇప్పుడు వెండితెరపై కూడా తన నటనతో నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు.అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు.

శివుడి పాత్రకి తెలుగులో ఎవరైనా హీరోని తీసుకుంటే ‘అఖండ 2’ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కి ఇంకా హెల్ప్ అయ్యేది కదా అని..! అలా పెట్టుకుంటే బాక్సాఫీస్ కి నిజంగానే హెల్ప్ అయ్యేది కానీ.. టాలీవుడ్ స్టార్ హీరోని పెట్టుకుంటే శివుడు పాత్ర హైలెట్ కాదు ఆ స్టార్ మాత్రమే హైలెట్ అవుతాడు. అప్పుడు ఆ పాత్రకి ఆడియన్స్ కనెక్ట్ కాకపోవచ్చు. అందుకే మేకర్స్ టాలీవుడ్ స్టార్ ని పెట్టుకోలేదు. అలాగే తరుణ్ ఖన్నా కూడా ఆ లోటు తెలీనివ్వలేదు.

‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus