ఆశ్చర్యపరుస్తున్న విజయ్ దేవరకొండ క్రేజ్..జనాన్ని కంట్రోల్ చేయలేక క్యాన్సిల్ అవుతున్న “లైగర్” ఈవెంట్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నమ్మశక్యం కాని క్రేజ్ షాక్ కు గురిచేస్తోంది. ఆయన కొత్త సినిమా “లైగర్” ప్రచారం కోసం దేశంలోని ఏ రాష్ట్రం వెళ్లినా వెల్లువలా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లైగర్ ట్రైలర్ రిలీజ్ ముంబైలోని అంథేరీలో జరిగినప్పటి నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఎక్కడ సినిమా కార్యక్రమం జరిగినా అభిమానులు, ఫిల్మ్ లవర్స్ విజయ్ ను చూసేందుకు తరలివస్తున్నారు.

ఇటీవల నవీ ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. ఈ ఈవెంట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ హీరోలకు మించిన క్రేజ్ విజయ్ దేవరకొండకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక కార్యక్రమాన్ని రద్దు చేయాల్సివచ్చింది. వచ్చిన వారి క్షేమం దృష్ట్యా, ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందోనని విజయ్ స్వయంగా ఈ ఈవెంట్ ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. తాజాగా లైగర్ టీమ్ ప్రమోషన్ కోసం బీహార్ రాజధాని పాట్నా వెళ్లింది. అక్కడి ఏఎన్ కాలేజీలో ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడికి వేలాది అభిమానులు క్యూలు కట్టారు. ఈ భారీ క్రౌడ్ మొన్నటి ముంబై ఈవెంట్ లాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ లాంటి రాష్ట్రంలోనూ విజయ్ దేవరకొండ క్రేజ్ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కూడా ముంబైలాగే భారీ జన సమూహం వల్ల ఈవెంట్ రద్దు చేశారు.

లైగర్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేట్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

https://twitter.com/TheVerma_/status/1556157696008601601?t=AmVN0yh1wHt1s3GLEnP0lw&s=19

 

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus