విజయ్ దేవర కొండ కొత్త చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ప్రారంభం

  • May 12, 2016 / 10:36 AM IST

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ లో మెప్పించిన విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం మే 11న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ప్రారంభమైన రోజునే సినిమా పస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

విజయ్ దేవర కొండ ఇప్పుడు ‘పెళ్లిచూపులు’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus