విజయ్ దేవరకొండ సరికొత్త లుక్ కాపీ అంటున్న నెటిజన్లు!

‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో అమాంతం స్టార్ హీరో అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. సినిమాలతోనే కాకుండా తన ఆటిట్యూడ్ తో ‘హార్డ్ కోర్ ఫ్యాన్స్’ ను ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఆ ఆటిట్యూడ్ ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందేమో కానీ మిగిలిన ప్రేక్షకులకి, అలాగే ఇండస్ట్రీలో కొంతమంది చిన్న హీరోలకి చిరాకు పుట్టిస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విజయ్ సినిమాలు ప్లాప్ అయితే వారు పండగ చేసేసుకుంటారు అనే ప్రచారం కూడా ఎప్పటి నుండో జరుగుతుంది. ఈ ఏడాది ఆయన హీరోగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం డిజాస్టర్ కావడంతో అదే రీతిలో ఎంజాయ్ చేసిన వరున్నారంట.

ఇది పక్కన పెడితే.. విజయ్ ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని క్రాంతి మాధ‌వ్ డైరెక్షన్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో ‘క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్’ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుండే విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే ఆ స్టిల్ కాపీ కొట్టిందని తెలియటానికి పెద్దగా సమయమేమి పట్టలేదు. “చార్లెస్ అజ్నవౌర్ -ల బొహేమి (భౌభౌ రీమిక్స్ )” అంటూ యూట్యూబ్ ఒక సాంగ్ ఉంది. అందులో ఉండే పోస్టర్ లో ఉండే హీరో లుక్ కూడా విజయ్ లుక్ లగే ఉంటుంది. సేమ్ టు సేమ్ అదే ఇంటెన్స్ కనిపిస్తుంది. ఈ సాంగ్ 2018 ఫిబ్రవరి 13 న విడుదల అయ్యింది. దీనిని బట్టి చూస్తే విజయ్ లుక్ కాపీ-పేస్ట్ అని అర్ధం అవుతుంది. వైవిధ్యమైన సినిమాలు తీసే పేరున్న క్రాంతి మాధవ్ ఇలాంటి కాపీ లుక్ ని ఫస్ట్ లుక్ గా ఎందుకు రిలీజ్ చేశాడు. ఇలాంటిది ఒకటి ఉంటుందని ఆయనకి తెలియదా..? లేక కాపీ కొట్టిన ఎవరు కనిపెట్టలేరనే ధీమా తో విడుదల చేశాడా..? మరి ఈ విషయం మీద సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
బందోబస్త్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus