Vijay, Rashmika: రష్మికకి విజయ్‌ ఫిదా అయ్యి ఏం చేశాడంటే?

‘వారసుడు’గా తెలుగు నాట మొదలై ఆ తర్వాత ‘వరిసు’గా మారిపోయింది దిల్‌ రాజు – విజయ్‌ – వంశీ పైడిపల్లి సినిమా. అయితే ఆ విషయం ఇప్పుడెందుకు అంటారా? ‘వారసుడు’గా సినిమా మొదలైన రోజు జరిగిన సంఘటన ఒకటి మళ్లీ ఇప్పుడు జరిగింది. అందుకే ఆ రోజును గుర్తు చేయాల్సి వచ్చింది. అంగరంగవైభవంగా దిల్‌ రాజు ఆధ్వర్యంలో ‘వారసుడు’ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అది ‘వరిసు’ ఎలా అయ్యింది అనేది తర్వాత చూద్దాం. ఆ ఈవెంట్‌లో స్పెషల్‌ అంటే విజయ్‌కి హీరోయిన్‌ రష్మిక మందన దిష్టి తీయడమే.

ముహూర్తం షాట్ అయిపోయాక ఫొటోలు దిగుతున్నప్పుడు రష్మిక ఒక్కసారిగా విజయ్‌ వైపు తిరిగి రెండు చేతులు పైకి ఎత్తి దిష్టి తీసింది. దీంతో విజయ్‌తో సహా అందరూ షాక్‌ అయిపోయారు. విజయ్‌ని తాను ఎంతగా అభిమానిస్తుందో ఆ పనితో చూపంచింది రష్మిక. అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్‌ అయ్యింది. ‘వరిసు’ సినిమా సాంగ్స్‌ లాంచ్‌ ఈవెంట్ ఆ మధ్య చెన్నైలో ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్‌ ఫుటేజ్‌ను సన్‌ టీవీ విడుదల చేసింది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు కనిపించాయి.

‘రంజిదమే రంజిదమే..’ పాటకు జానీ మాస్టర్‌తో కలసి రష్మిక స్టేజీ మీద డ్యాన్స్‌ వేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ విజయ్‌ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు. అలాగే విజయ్‌ ఆమెను మెచ్చుకొంటూ దిష్టి తీశారు. సినిమా ముహూర్తం నాడు రష్మిక దిష్టి తీసిందే.. అచ్చంగా అలానే చేశారు విజయ్‌. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రష్మిక ఫ్యాన్స్‌ అయితే మా క్రష్మికకి ఇది బెస్ట్‌ మూమెంట్‌ అంటూ పొంగిపోతున్నారు.

ఇక ‘వారసుడు’ టు ‘వరిసు’ సంగతికొస్తే.. ఈ సినిమాను తొలుత ద్విభాషా చిత్రంగా స్టార్ట్‌ చేశారు దిల్‌ రాజు. అయితే తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు బంద్‌ చేసినప్పుడు ఆయన యూటర్న్‌ తీసుకొని ఇది తమిళ సినిమా అని అందుకే షూట్‌ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఆ డబ్బింగ్‌ అనే మాటను కంటిన్యూ చేశారు. ఏంటిది అని అడిగితే.. ముందు తమిళంలో తీసి తర్వాత తెలుగులోకి డబ్‌ చేశాం అని అసలు విషయం చెప్పింది టీమ్‌.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus