Mahesh Babu: విజయ్- వంశీ పైడిపల్లి ల ప్రాజెక్టు వెనుక అంత కథ ఉందా?

గత నాలుగైదు రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో అయిన ఇళయదళపతి విజయ్ తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. దాదాపు ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మించబోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ తో హిట్టు కొట్టి ఫామ్లో ఉన్న దిల్ రాజు…

రాంచరణ్-శంకర్ ల తో ఓ పాన్ ఇండియా మూవీని రూపొందించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అలాగే విజయ్ తో కూడా ఓ మూవీ కన్ఫర్మ్ చేసుకున్నాడట.కథ ప్రకారం ఇందులో విజయ్. గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడట.అయితే ఈ కథ.. గతంలో మహేష్ బాబు రిజెక్ట్ చేసిందే అని టాక్. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పూర్తయిన వెంటనే తన నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని మహేష్ బాబు అనౌన్స్ చేసాడు. దీనికి కూడా దిల్ రాజునే నిర్మాత.. అని కూడా ప్రకటించారు.

కానీ ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ కి కమిట్ అయ్యాడు. తర్వాత త్రివిక్రమ్ తో కూడా మూవీ చేయబోతున్నాడు. కాబట్టి జనాలు ఆ ప్రాజెక్ట్ గురించి మర్చిపోయారు. మహేష్.. వంశీ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయడానికి ముఖ్య కారణం దానికి భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే అంటూ అప్పుడు గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే ప్రాజెక్టుని విజయ్ తో పాన్ ఇండియా లెవల్లో చెయ్యాలని వంశీ-దిల్ రాజులు డిసైడ్ అయ్యి ఈ స్టెప్ తీసుకున్నారట.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus