కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో డిఫరెంట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న నటుడు విజయ్ సేతుపతి. టాలీవుడ్ లో అయితే అతని రేంజ్ మామూలుగా లేదు. ఉప్పెన ఈవెంట్ లోనే అతనికున్న క్రేజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. అయితే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో మొదట నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సుకుమార్ ఈవెంట్ లో మాట్లాడిన దాని బట్టి అర్ధమయ్యింది. మెగాస్టార్ నుంచే కాకుండా సుకుమార్ నుంచి కూడా అతనికి ఫోన్ కాల్స్ వెళ్లాయి.
సుక్కు అయితే మీరు చేయాల్సిందే అని పట్టుబట్టిన తరువాత సేతుపతి కథ విని ఫిదా అయ్యాడు. అయితే పుష్ప కోసం కూడా అతన్ని సెలెక్ట్ చేసుకోగా డేట్స్ కారణంగా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఆ సినిమా చేసి ఉంటే బావుండు అని సేతుపతి ఇప్పుడు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుక్కు సార్ ఒక్క చాన్స్ అంటూ సేతుపతి మొహమాటం లేకుండా అడిగేశారు.
ఇక ఇప్పటివరకు పుష్ప విలన్ విషయంలో చిత్ర సుకుమార్ అయితే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయ్యింది. విలన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను మరో నెల రోజుల్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి సుకుమార్ మళ్ళీ సేతుపతి విషయంలో ఏదైనా ఆలోచనకు వస్తారో లేదో చూడాలి.