Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

తమిళ సినిమా పరిశ్రమ, అందులోని పెద్దలు, స్టార్‌ హీరోలు బయటకు చెప్పకపోయినా చాలా ఏళ్లు వాళ్లు చేస్తున్న పోరాటం ‘రూ.1000 కోట్లు’. కావాలంటే మీరే చూడండి. పెద్ద హీరో సినిమా కాస్త బజ్‌ ఉంది అనగానే రూ.1000 కోట్ల వసూళ్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాస్త పేరున్న హీరో సినిమాకు ఇతర పరిశ్రమల్లోనూ వసూళ్లు బాగొస్తున్నాయి అంటే కోలీవుడ్‌ విమర్శకులు కూడా రూ.1000 కోట్ల మాట అంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆ అవకాశం వారికి దక్కడం లేదు. అయితే ఈసారి ‘జైలర్‌ 2’తో ఆ ఫీట్‌ చేయాలని చూస్తున్నారు.

Vijay Sethupathi

తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు అంటే ‘2.0’ సినిమా గురించే చెప్పాలి. ఎనిమిదేళ్ల క్రితం రూ.800 కోట్ల వసూళ్లు అందుకుంది. ఆ తర్వాత ‘జైలర్‌’ సినిమాతో రజనీకాంతే రూ.600 కోట్లు సంపాదించారు. ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తుండటం చూసి రూ.1000 కోట్లు వస్తాయనుకున్నారు. కానీ రాలేదు. తమిళ, కన్నడ, మలయాళ స్టార్‌ నటుల్ని అతిథి పాత్రల్లోకి తీసుకొని అక్కడ బజ్‌ తీసుకొచ్చినా వారి వెయ్యి కోట్ల ముచ్చట తీరలేదు. ఇప్పుడు ప్లానింగ్‌ మరింత పక్కాగా చేస్తున్నారు.

ముత్తువేల్‌ పాండియన్‌ పాత్రలో రజనీకాంత్‌ మరోసారి సందడి చేయనున్న ‘జైలర్‌ 2’లో స్టార్‌ పవర్‌ని మరింత యాడ్‌ చేస్తూ మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతిని కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని టీమ్‌ అధికారికంగా ప్రకటించింది కూడా. ఆయనతోపాటు శివ రాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్‌ షారుఖ్‌ ఖాన్‌, సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కూడా నటిస్తున్నారు. దీంతో మొత్తంగా సౌత్‌, నార్త్‌ని కవర్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా విజయం సాధిస్తే రూ.1000 కోట్లు పక్కాగా వస్తాయి అని అంటున్నారు.

ఎందుకంటే తొలి ‘జైలర్‌’లో బాలీవుడ్‌ టచ్‌ లేదు. ఇప్పుడు అది కూడా ఉంది, రజనీకాంత్‌ మేనియా కూడా ఉంది కాబట్టి వసూళ్లు అంతమొత్తం రావొచ్చు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్‌ 12న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

అల్లు అర్జున్‌ – లోకేశ్‌ ప్రాజెక్ట్‌ టీజర్‌ లిరిక్స్‌ విన్నారా? ‘పుష్ప’ స్టైల్‌లో…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus