Vijay Sethupathi: ‘పుష్ప 2’ లో పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి.. ?

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన మూవీ ఇది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు ఫహాద్ ఫాజిల్ కూడా నటించాడు. పార్ట్ 1 లో దాదాపు సునీల్ ను విలన్ గా చూపించారు. ఇక పార్ట్ 2 లో మాత్రం ఫహాద్ ఫాజిల్ విలన్ అని సుకుమార్ చెప్పకనే చెప్పాడు.

నిజానికి ఈ పాత్రకి మొదట విజయ్ సేతుపతిని అనుకున్నారు. ‘ఉప్పెన’ కి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారే నిర్మాతలు కావడంతో ఆ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతి చేస్తున్న టైం లో ‘పుష్ప’ పార్ట్ 1 లో విలన్ గా చేయమని అడిగారు. అయితే ఆ టైములో విజయ్ సేతుపతికి కాల్షీట్ల సమస్య ఉంది. కోవిడ్ కారణంగా అతను నటించాల్సిన చాలా సినిమాలు పెండింగ్లో ఉన్నాయి.

కాబట్టి ‘పుష్ప’ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినట్లు ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే ‘పుష్ప 2’ లో కూడా ఓ పోలీస్ పాత్ర ఉంటుందట. దీని కోసం విజయ్ సేతుపతిని దర్శకనిర్మాతలు సంప్రదించినట్లు వినికిడి.అయితే ఈసారి మాత్రం విజయ్ సేతుపతి ఎస్ చెప్పినట్టు టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. పుష్ప రాజ్ కు హెల్ప్ చేసే విధంగా ఈ పాత్రని సుకుమార్ డిజైన్ చేసినట్లు వినికిడి.

అలాగే విజయ్ సేతుపతి మార్క్ విలక్షణమైన సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయట. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. జూలై లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. అది కాస్త సెప్టెంబర్ కు మారినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నుండే ‘పుష్ప2’ సెట్స్ పైకి వెళ్ళనుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus