Vijay Sethupathi: ఆ హీరోయిన్ తో సినిమా…మరోసారి చెయ్యనని తెగేసి చెప్పిన హీరో!

Ad not loaded.

ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం మరో రెండు సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్గా మొదటి మూడు సినిమాలు ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి అయితే తదుపరి కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొంటున్నటువంటి ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని తెలుస్తుంది.

ఇక తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా తన దృష్టి సారించారు. తమిళంలో కూడా పలు సినిమా అవకాశాలను అందుకుంటుంది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నటువంటి కొత్త సినిమాలో కృతి శెట్టికి నటించే అవకాశం వచ్చిందట. ఈ సందర్భంగా మేకర్స్ సినిమాలో హీరోయిన్ తానే అంటూ కృతి శెట్టి ఫోటో పంపించడంతో ఆ ఫోటో చూసినటువంటి విజయసేతుపతి వెంటనే తనని ఈ సినిమా నుంచి తీసేయమని చెప్పారట.

గతంలో కూడా ఓసారి కృతి శెట్టితో చేసే అవకాశం రావడంతో ఈయన ఆ సినిమా చేయనని చెప్పేశారు. తాజాగా మరోసారి కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ హీరోగా సినిమాలు అసలు చేయనని కరాకండిగా చెప్పేసారట. ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించిన తాను ఇప్పుడు ఆమె సరసన హీరోగా నటించడానికి ఏమాత్రం ఒప్పుకోనని, తనని చూస్తేనే కూతురు అనే భావన తనలో కలుగుతుందని

అందుకే ఈ హీరోయిన్ తో తాను సినిమాలు అసలు చేయనని తేల్చి చెప్పారట. ఇలా కృతి శెట్టితో సినిమాలు చేయడం గురించి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మరోసారి ఈ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus