విజయ్ (Vijay) భార్య సంగీత (Sangeetha) గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసుండదు.ఆమె పూర్తి పేరు సంగీత సోర్నలింగం. వీరిది ప్రేమ వివాహం. అలాగని విజయ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సంగీత పాపులర్ అయ్యింది అనుకుంటే పొరపాటే. ఆమె మొదటి నుండి ధనవంతురాలే. సంగీత ఆస్తులు ఆల్మోస్ట్ విజయ్ (Vijay) సంపాదనకి ఈక్వల్ గా ఉంటాయట.సంగీత గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆమె శ్రీలంక తమిళ కుటుంబంలో జన్మించినట్టు తెలుస్తుంది.
అయితే ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు లండన్‌కు షిఫ్ట్ అయ్యారట. సంగీత ఆస్తుల విలువ దాదాపు 3 లక్షల కోట్లని తెలుస్తుంది. ఈమె తండ్రి పెద్ద బిజినెస్ మెన్ కావడంతో ఆమె వారసురాలిగా వచ్చిన వాటా ఇది అని తెలుస్తుంది. అలాగే విజయ్ కి 6 లక్షల కోట్ల ఆస్తి ఉన్నట్టు తెలుస్తుంది.
విలాసవంతమైన జీవితం విజయ్ (Vijay) సొంతం. 10 తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి అతనిది. సినిమాల్లో బోలెడంత స్టార్ డమ్ ఉంది. రూ.200 కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయినప్పటికీ ఇతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయ్ పాల్గొన్నారు. అతన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.
దాదాపు 40 మంది చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉండడం విషాదకరం. ఈ విషయమై చింతిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షలు చెల్లించబోతున్నట్టు కూడా తెలిపారు.