Vijay: తమిళ స్టార్‌ హీరోలను పట్టేస్తున్న తెలుగు నిర్మాతలు.. ఇప్పుడు ఎవరంటే?

తెలుగు సినిమా నిర్మాతలు అంటే తెలుగులోనే సినిమాలు తీస్తారు అనుకునేవారు ఒకప్పుడు. తమిళ సినిమా హీరోలు తమిళ నిర్మాతలతోనే సినిమాలు చేస్తారు అని కూడా అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన నిర్మాతలు, అక్కడి హీరోలు సినిమాలు చేయడం పెరుగుతోంది. తాజాగా మరో తెలుగు నిర్మాత – తమిళ హీరో కాంబినేషన్‌ సినిమా ఓకే అయ్యింది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ అని టాక్‌.

పాన్‌ ఇండియా సినిమా ఫీవర్‌ పెరిగాక ఇప్పుడు ఎక్కడి హీరో అయినా, ఎక్కడి నిర్మాణ సంస్థ అయినా అందరిదీ అనేలా మారింది పరిస్థితి. క్రమంలో ఒక పాన్‌ ఇండియా సినిమా తీసి రిలీజ్‌ చేసి… ఇప్పుడు మరో పాన్‌ ఇండియా సినిమాను సెట్స్‌ మీద పెట్టుకున్న డీవీవీ దానయ్య… ఇప్పుడు మరో ప్లాన్‌ చేస్తున్నారట. ఈసారి తెలుగు హీరోను కాకుండా తమిళ హీరోతో సినిమా ప్లాన్‌ చేస్తున్నారట. దళపతి విజయ్‌ ఆ హీరో అని సమాచారం

తెలుగు నిర్మాత, తమిళ హీరో కాంబినేషన్‌ ప్రారంభమైంది దిల్ రాజు – (Vijay) విజయ్‌తో. వరిసు / వారసుడుతో మంచి బిజనెస్‌ చేసుకున్నారాయన. ఇప్పుడు దానయ్య కూడా విజయ్‌తోనే సినిమా చేస్తారు అంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య డీల్‌ కుదిరిందని త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే దర్శకుడు ఎవరు అనేది చూడాలి. ఓ తెలుగు దర్శకుడితోనే ఆ సినిమా ఉంటుంది అనేది లేటెస్ట్‌ భోగట్టా.

మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఓ ప్లాన్‌ చేస్తోంది. అజిత్‌తో ఓ సినిమా కుదిరింది అంటున్నారు. ‘మార్క్ ఆంటోనీ’ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కూడా త్వరలో అనౌన్స్‌మెంట్‌ చేస్తారట. ఇక ఇప్పటికే ‘సార్‌’ సినిమాతో ధనుష్‌ ఇక్కడకు వచ్చేశాడు. ఇప్పుడు శేఖర్‌ కమ్ముల సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా ఈ లిస్ట్‌లో సూర్య కూడా ఉన్నాడని టాక్‌. ‘ఊపిరి’ సినిమాతో కార్తి ఎప్పుడో చేసేశాడు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus