తన ఇల్లు ఆక్రమించిందని కేసు పెట్టిన విజయకుమార్

ఇది వరకు వార్తల్లో అత్త కోడళ్ల గొడవలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడువార్తల్లో తండ్రి కూతుళ్లు నిలుస్తున్నారు. ప్రతి భర్త భార్యని రాణిగా చూడకపోవచ్చు కానీ.. ప్రతి తండ్రి తన కూతురిని యువరాణి గా పెంచుతాడనే ఓ నానుడి ఉంది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ప్రేమ కూడా మారిపోతున్నట్టు ఉంది. హైదరాబాద్ లో కూతురిపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన మరవకముందే .. కూతురు తన ఇంటిని లాక్కుందని ఓ తండ్రి చెన్నైలోని మధురవాయిల్ పోలీస్ స్టేషన్ లోఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరు? ఏంటి.. వివరాల్లోకి వెళితే… ప్రముఖ తమిళ నటుడు విజయకుమార్ తన కొడుకుతో కలిసి కొట్టివాక్కమ్ లో ఉన్న ఇంట్లో ఇవసిస్తుంటారు. అలపాక్కమ్ లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో ఉన్న మరో ఇంటిని సినిమా షూటింగ్ కి ఇస్తుంటారు.

అయితే వారం రోజుల క్రితం అతని కుమార్తె వనిత షూటింగ్ కోసం అలపాక్కమ్ లోని ఇంటిని అద్దెకు తీసుకుంది. షూటింగ్ పూర్తయినా ఇంటిని ఖాళీ చేయడం లేదు. ఖాళీ చేయమని అడిగితే… లాయర్లు, రౌడీలతో బెదిరిస్తుండడంతో విజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వనితపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న అలపాక్కమ్ లోని ఇంటికి వెళ్లి వనితను విచారించగా… ఈ ఇంట్లో తనకు కూడా భాగముందని, అందుకే తాను ఖాళీ చేయనని ఆమె స్పష్టం చేసింది. ఆధారాలు చూపాలని పోలీసులు అడగ్గా… వారితో వనిత వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని మీడియాన్ని ప్రశ్నించగా ఫొటోగ్రాఫర్ల కెమెరాలను ఆమె నేలకేసి కొట్టింది. ఈ తండ్రి కూతుళ్ళ గొడవ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus