సినిమా ఆఫర్స్ పై క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

2006లో చివరగా నాయుడమ్మ సినిమాలో నటించిన సీనియర్ నటి విజయశాంతి ఆ తరువాత 14 ఏళ్ళ వరకు వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇక మొత్తనికి మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రీఎంట్రీతో మళ్ళీ బిజీ కావచ్చని టాక్ అయితే గట్టిగానే వచ్చింది. వరుసగా ఆఫర్లు అయితే వచ్చయట.

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రూమర్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నటనపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. “ప్రస్తుతానికైతే రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాను. మళ్ళీ నటిగా బిజీ అవుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇక మెగాస్టార్ తో కూడా నటించడం లేదు. ఆఫర్స్ వచ్చిన మాట వాస్తవమే గాని నాకు ఇప్పుడు నటన కంటే కూడా ప్రజా సేవలో ఉండడమే ఇష్టం” అంటూ.. విజయశాంతి వివరణ ఇచ్చారు.

విజయశాంతి క్లారిటీ ఇవ్వడంతో ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అబద్దాలని తేలిపోయింది. ఇక ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆమె రానున్న రోజుల్లో మరింత బిజీ కానున్నట్లు చెబుతూ.. తన జీవితం మొత్తం ప్రజా సేవకు అంకితమని చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus