ది కేరళ స్టోరీ మూవీని పలు రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను బ్యాన్ చేయడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ది కేరళ స్టోరీ సినిమాపై బ్యాన్ విధించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ నేత విజయశాంతి కూడా ఈ సినిమాను బ్యాన్ చేయడంపై ఫైర్ కావడంతో పాటు ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విజయశాంతి తన పోస్ట్ లో ది కేరళ స్టోరీ వాద వివాదాలు, నిరసనలు, చర్చలను గమనిస్తే ఒక విషయం అర్థమవుతోందని ఏ మూవీ అయినా ఆ సినిమాను చూడాలా వద్దా?
అందులోని అంశాలు నిజమా కాదా? అనే విషయాలను ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాలని విజయశాంతి చెప్పుకొచ్చారు. ప్రజలకు ఉండే ఆ విజ్ఞతను కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం అని విజయశాంతి చెప్పుకొచ్చారు. ది కేరళ స్టోరీ మూవీకి వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లను కోర్టులు దూరం పెట్టాయని ఆ సినిమాను ప్రజలకు ఎలా దూరం చేస్తారని ఆమె ప్రశ్నించారు.
మనది ప్రజాస్వామిక దేశమని (Vijayashanti) విజయశాంతి పేర్కొన్నారు. ఒక సినిమాలో ఏ అంశాలను స్వీకరించాలో ఏ అంశాలను తిరస్కరించాలో ప్రజలకు తెలియదా అని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వర్గాలకు భయపడి సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం దారుణమని ఆమె తెలిపారు. గతంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలో కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టిస్తే అ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని విజయశాంతి తెలిపారు.
ప్రదర్శనను ఆపగలరేమో కానీ అందులోని సత్యం మాత్రం గుండెల్ని చీల్చుకుని మనస్సులో నాటుకోవడం ఖాయమని విజయశాంతి అన్నారు. విజయశాంతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయశాంతి కామెంట్లకు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?