ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్స్ లో నా ఫేవరెట్ ఎవరూ లేరు

ఇప్పుడు మనం నయనతార, అనుష్క, సమంతలను పట్టుకొని లేడీ సూపర్ స్టార్స్ అంటున్నాం కానీ.. 80 నుంచి 90వ దశకం వరకూ “లేడీ సూపర్ స్టార్” అనే ట్యాగ్ ను దక్కించుకోవడంతోపాటు ఆ స్టార్ స్టేటస్ కు తగ్గట్టు సినిమాలు చేసిన ఏకైక కథానాయకి విజయశాంతి. కొన్నేళ్ళ విరామం అనంతరం ఆమె త్వరలోనే “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనుంది. మహేష్ బాబుతో ముప్పై ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండడాన్ని, మళ్ళీ వెండితెరకు రీఎంట్రీ గురించి మాట్లాడుతూ ఒక మీడియా హౌజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విజయశాంతి.. నేటితరం హీరోయిన్స్ లో మీకు ఎవరు ఇష్టం అని అడిగిన ప్రశ్నకు “ఎవరూ లేరు” అని చెప్పి షాక్ ఇచ్చింది.

అసలు ప్రస్తుతం హీరోయిన్స్ లో ఎవరి కెరీర్ కు లాంగిటివిటీ ఉంది. కనీసం బాడీ స్ట్రక్చర్లు కూడా బాగోవడం లేదు. మా తరంలో దర్శకులు, నిర్మాతలు హీరోయిన్స్ ఇళ్ల దగ్గర క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు అది లేదు. అందుకే.. నాకు ఈతరం హీరోయిన్స్ లో ఫేవరెట్ ఎవరూ లేరు” అని క్లారిటీ ఇచ్చింది విజయశాంతి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus