గ్యాంగ్ లీడర్ తో రాములమ్మ

మెగాస్టార్ చిరంజీవి “కత్తిలాంటోడు” సినిమాలో హీరోయిన్ గా అనుష్క ఎంపిక అయినట్లు వార్త వెలువడగానే అభిమానుల్లో తలెత్తిన మరో ప్రశ్న.. “ఇంకో హీరోయిన్ ఎవరు?” అని. ఎందుకంటే ఈ సినిమాలో చిరు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒక పాత్రకి అనుష్క డిసైడ్ అయింది. మరో పాత్రకి ఎవరు అని ఆరా తీశారు.

ఈ చర్చల్లో బయట పడిన అంశం ఏమిటంటే రెండో పాత్రకు హీరోయిన్ ముందే డిసైడ్ అయిపోయిందని.. ఆమె ఎవరో కాదు .. గ్యాంగ్ లీడర్ లో చిరు పక్కన చిందేసిన విజయ శాంతి అని. ఈ విషయాన్నీచిత్ర యూనిట్ కొంత కాలం చాల రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నారు.

లేడి అమితాబ్ బచ్చన్ విజయ్ శాంతి కొంత కాలంగా పవర్ ఫుల్ పాత్ర ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇద్దామని ఆలోచిస్తున్నారు. కలక్షన్ల వర్షం కురిపించిన ఒసేయ్ రాములమ్మకి సీక్వెల్ తీయాలని మొదట్లో అనుకున్నా.. సీక్వెల్ సెంటిమెంట్ తెలుగు సినిమాలకు సెట్ కావడం లేదని పక్కన పెట్టారు. “చాలా కాలం తర్వాత తెర ఫై కనిపించ బోతున్నాను. ప్రజలకు నా మీద భారీ అంచనాలు ఉంటాయి. అందుకే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడుతున్నాను” అని ఈ మధ్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయ్ శాంతి చెప్పారు.

అందుకే ఒక దేశభక్తి కథను ఓకే చేసినట్లు తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ పనుల్లో ఉండగా చిరు నుంచి ఆఫర్ రాగానే విజయ్ శాంతి ఓకే చేసినట్లు సమాచారం. మెగాస్టార్ పక్కన గ్లామర్ గా కనిపించడానికి అప్పుడే కసరత్తులు మొదలు పెట్టినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus