విజయ్ సినిమాకి విజయేంద్రుని సాయం!

దాదాపు ముప్పై ఏళ్లకు పైగా పరిశ్రమలోనే ఉన్నారు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. ఇన్నేళ్ళలో రాని గుర్తింపు మగధీర, ఈగ వంటి సినిమాలతో వచ్చింది. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయీజాన్’ సినిమాలతో అది శిఖర స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు అన్ని ఉడ్ లోని బడా హీరోలకు ఆయన కథలే కావాలి. గట్టి బ్యాక్ గ్రౌండ్ నిఖిల్ కుమార్ లాంటి ఎంట్రీ హీరోలకు అతడే వారధి. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే విజయేంద్రుని కాలానికి గిరాకీ బాగా పెరిగింది.

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ తర్వాతి సినిమాకి విజయేంద్రుడు సాయం కోరారట. ‘రాజా రాణి’ సినిమాతో మెగాఫోన్ పట్టిన అట్లీతో ‘తెరి’ సినిమా చేసిన విజయ్ తన 61వ సినిమానీ అతడితోనే చేయనున్నాడు. ఈ సినిమాకి కథ అందిస్తున్నారట విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం విజయ్ భరతన్ దర్శకత్వంలో చేస్తున్న ‘భైరవ’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇది పూర్తవగానే అట్లీ – విజయ్ సినిమా మొదలవనుంది.

https://www.youtube.com/watch?v=BZNb3rIZHXk

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus