Vijaykanth: విజయ్‌ కొత్త సినిమా కోసం విజయ్‌కాంత్‌ను తెస్తున్నారట!

తమిళ సినీ పరిశ్రమలో, ఆ మాటకొస్తే దక్షిణాదిలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నటుడు విజయ్ కాంత్. కెప్టెన్‌గా ఆయనను ఇప్పటికే సినిమా జనాలు స్మరించుకుంటూ ఉంటారు. అంతలా తన పాత్రలు, నటనతో మెప్పించారాయన. ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఆయన కోసం ‘ది గోట్‌’ సినిమా బృందం ఓ ఆసక్తికర పని చేయబోతోంది. ఆయనను మరోసారి వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ‘ది గోట్‌’లో విజయ్‌ కాంత్‌ అతిథి పాత్రలో కనిపిస్తాడట.

విజయ్, వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT). ఈ సినిమాలో విజయ్‌కాంత్‌ అతిథి పాత్రలో కనిపిస్తారని కోడంబాక్కం టాక్. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో కెప్టెన్ విజయ్ కాంత్‌ను తిరిగి సృష్టించబోతున్నారట. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని టాక్‌. AI సాయంతో విజయ్‌కాంత్‌ను సినిమాలో చూపించబోతున్నట్లు కుటుంబ సభ్యులకు విజయ్ చెప్పారట. వాళ్ల నుండి పర్మిషన్‌ తీసుకున్నాకే పనులు మొదలయ్యాయట.

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. డీఏజింగ్ టెక్నాలజీతో ఓ పాత్రను కుర్రాడిగా మలుస్తారు అని అంటున్నారు. దీని కోసం ప్రత్యేకంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ వాడుతున్నారు. అలా విజయ్‌ కాంత్‌ను ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకొస్తున్నారట. దివంగత విజయ్ కాంత్ మళ్లీ తెరపై కనిపిస్తారని తెలియడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. విజయ్‌, వెంకట్‌ ప్రభుకు (Vijaykanth) విజయ్‌కాంత్‌ మీద ఉన్న అభిమానమే ఇదంతా చేయిస్తోందట.

ఇటీవల విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతికి చేరాయనేది మరో టాక్‌. అలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ విషయంలో ఇప్పటి నుండే టీమ్‌ భారీ ప్లాన్స్‌ వేస్తోంది అని చెబుతున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus