సందేశానికే సై అంటున్న విజయ్!

వరుస విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్. ఈ మధ్య కాలంలో విజయ్ నటిస్తున్న చిత్రాల్లో కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నాడు. సోషల్ ఎలెమెంట్స్ వాటి సొల్యూషన్స్ తో కూడిన కథలకే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఒక్క ‘భైరవ’ ‘పులి’ మినహా తాజాగా వచ్చిన ‘తుపాకి’ ‘తేరి’ ‘కత్తి’ ‘మెర్సల్’ ‘సర్కార్’ వంటి చిత్రాలు మెసేజ్ తో కూడుకున్నవే.

తాజాగా విజయ్ 63 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కూడా ఒక మెసేజ్ తో కూడుకున్న కధేనంట. ఈ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్ర పోషిస్తున్నాడట. స్పోర్ట్స్ లో జరిగే అక్రమాలు వాటిని ఎలా అరికట్టాలి అనేది కధాంశమట. ఈ చిత్రంలో మరోసారి విజయ్ – నయన్ కలిసి నటిస్తున్నారు. గతంలో విజయ్ – అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘తేరి’ ‘మెర్సెల్’ మంచి విజయాలు నమోదు చేసాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus