Varasudu: దిల్‌ రాజు రిలీజ్‌ డేట్ చెప్పి మార్చడంలో ఆంతర్యం ఏమిటి?

తమిళనాట చాలా ఏళ్లుగా విజయ్‌ వర్సెస్‌ అజిత్‌ అనే కాన్సెప్ట్‌ నడుస్తోంది. అయితే అది హీరోల సినిమాల విషయంలో ఉంటే.. అభిమానులు మాత్రం వ్యక్తిగతం తీసుకుంటున్నారు. ఈ విషయంలో వాళ్ల హీరోలు చెప్పినా వినడం లేదు అని చెబుతుంటారు. అయితే హీరోలు నోటితో వద్దని, నొసటితో అవును అంటున్నారా? ఏమో ‘వారసుడు’ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో మార్పు చూసేసరికి కావాలనే ఇలా చేస్తున్నారా అనే డౌట్‌ వస్తోంది. కావాలంటే మీరే చూడండి..

చాలా రోజుల క్రితమే ‘వరిసు’ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు నిర్మాత దిల్‌ రాజు. తెలుగు నిర్మాతలు, ఛాంబర్‌ చెప్పినా లెక్క చేయకుండా జనవరి 12న సినిమాను తీసుకొచ్చేస్తాం అని చెప్పారు. ఆయన నిర్మాతల మాట, పెద్దల మాట ఎందుకు వినలేదు అంటే అదే వేరే పంచాయితి. ఆ విషయం పక్కపెడితే.. అలా 12 అని చెప్పిన ‘వారసుడు’ ఇప్పుడు ఒక రోజు ముందు రిలీజ్‌ అవుతున్నాడు. మొన్న ట్రైలర్‌లో డేట్‌ లేనప్పుడే డౌట్ వచ్చినా గురువారం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

అయితే విజయ్‌ సినిమా ఇలా ఒక రోజు ముందుకు రావడం వెనుక అజిత్‌ ‘తునివు’ / ‘తెగింపు’ సినిమా ఉందని అంటున్నారు. ఇన్నాళ్లూ రిలీజ్‌ డేట్‌ చెప్పకుండా దాచిన అజిత్‌ టీమ్‌.. ఇప్పుడు జనవరి 11 అని చెప్పారు. దీంతో దిల్‌ రాజు కూడా ముందు చెప్పిన డేట్‌ను చెరిపేసి.. కొత్త డేట్‌ రాసుకొచ్చారు. అదే జనవరి 11. ఇలా చివరి నిమిషంలో డేట్ మార్చడంతో బాక్సాఫీసు దగ్గర ‘వరిసు’ వర్సెస్‌ ‘తునివు’గా మారింది.

అయితే ఎందుకు మార్చారు అనేది తెలియాలి. పోటీ కోసమే అనేది అర్థమవుతున్నా టీమ్‌ ఏం చెబుతారో చూడాలి. అయితే ఇలా తమిళ రీమేక్‌లు ఒకే రోజు వచ్చేస్తుండటంతో తెలుగు స్టార్ల సినిమాలకు ఓ ఇబ్బంది తప్పింది. 11న అజిత్‌, విజయ్‌ తమ లెక్క చూసుకుంటే.. 12న బాలయ్య వచ్చి సత్తా చూపిస్తాడు. 13న చిరు వచ్చి రప్ఫాడిస్తాడు. ఇక విజయం అంటారా? జనాలు ఆ లెక్కేంటో తేలుస్తారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus