అదిరిపోయే క్యాస్టింగ్ తో షూటింగ్ కి రెడీ అవుతున్న ‘మహేష్ 26’

అదిరిపోయే క్యాస్టింగ్ తో షూటింగ్ కి రెడీ అవుతున్న ‘మహేష్ 26’మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం పూర్తయిన వెంటనే తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘మహేష్ 26′ ను అనిల్ సుంకర… ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాలని అనుకున్నప్పటికీ.. అనిల్ సుంకర తో ఓ చిత్రం కమిట్మెంట్ ఉండడంతో… మహేష్ దిల్ రాజుని రిక్వెస్ట్ చేసాడట. మహేష్ రిక్వెస్ట్ తో దిల్ రాజు ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు దిల్ రాజు.ఈ చిత్రం మహేష్ అభిమానులకి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.

చాలా రోజుల తరువాత మహేష్ చేస్తున్న మంచి కమర్షియల్ చిత్రం ఇదేనట. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెంచేందుకు దిల్ రాజు – అనిల్ రావిపూడి లు మంచి కాస్టింగ్ ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన దాదాపు ఖరారు అయిపొయిందట. అంతేకాదు చాలా రోజుల తర్వాత విజయశాంతి ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో మహేష్ తల్లిగా విజయశాంతి నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మహేష్ తల్లిగా విజయశాంతి నటించింది. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ తరువాత మళ్ళీ మహేష్ కి తల్లిగా నటిస్తుందన్నమాట. అంతేకాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడట. 2015 లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు ఉపేంద్ర. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నాడు. పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus