విక్రమ్ కొత్త సినిమాపై భారీగా అంచనాలు.. సరికొత్త రికార్డులు క్రియేటవుతాయా?

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే పలు ఏరియాలలో బాహుబలి2 సినిమా క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డులను ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. గత ఐదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఒక్క ఏరియాలో కూడా బాహుబలి2 రికార్డులు బ్రేక్ చేయలేకపోయాయి.

అయితే విక్రమ్ మూవీ సూర్యపుత్ర కర్ణ షూటింగ్ త్వరలో మళ్లీ మొదలుకానుండగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. చాలా సంవత్సరాల క్రితం ఈ సినిమాకు సంబంధించి కొన్ని యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఆ సమయంలో వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమా షూట్ మళ్లీ మొదలు కానుండటంతో సినీ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఆర్.ఎస్.విమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే సినిమా ఇదేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ప్రమోషన్స్ చేస్తే మాత్రం విక్రమ్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ సినిమా కోసం నిర్మాతలు అత్యంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్, పొన్నియిన్ సెల్వన్2 సినిమాలతో మార్కెట్ ను పెంచుకున్న విక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా టీం కు , విక్రమ్ కు మధ్య సమస్యలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విక్రమ్ చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విక్రమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus