‘చియాన్’ దూసుకొస్తున్నాడు!!!

తమిళ సూపర్ హీరో చియాన్ విక్రమ్ కు మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది…అయితే అపరిచితుడుగా మనకు పరిచయం అయితే విక్రమ్ ఆ తరువాత చాలా సినిమాలు తెలుగులో సైతం రిలీజ్ చేశాడు….నటుడుగా ఎప్పుడు సక్సెస్ అందుకున్న విక్రమ్ కలెక్షన్స్ పరంగా మాత్రం కాస్త వెనకబడి ఉన్నాడు అనే చెప్పాలి…అయితే ఎక్కువగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ…..సాహసాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పుకునే విక్రమ్ సాధారణంగా ఒక సినిమా అయిన తరువాతే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు…..అయితే తాజాగా ఇరు మగన్(తెలుగులో ఇంకొక్కడు)తో భారీ సక్సెస్ సాధించడంతో సినిమాల స్పీడ్ పెంచాడు అని తెలుస్తుంది…విషయం ఏమిటంటే….ప్రతీ కెరెక్టర్లోనూ విభిన్నంగా కనిపించేందుకు తపన పడే విక్రమ్.. ఈ సారి ఆడియన్స్ కు షాక్ ఇవ్వబోతున్నాడు. ఒకేసారి ఐదు సినిమాలకు సైన్ చేసేసి.. అందులో మూడింటిని మొదలుపెట్టేయనున్నాడట.

ఆ సినిమా వివరాల్ళోకి వెళితే….తన సినిమా సామి గుర్తుందిగా…అదే మన బాలయ్య బాబు తెలుగులో లక్ష్మి నరసింహ పేరుతో తీసిన సినిమా…ఇప్పుడు అదే సినిమాకి సీక్వేల్ చేస్తున్నాడు విక్రమ్…ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు మరికొంత సమయం ఉంది. దీంతో మరిన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. టాలీవుడ్….కాలీవుడ్ ను పక్కన పెట్టి…..హాలీవుడ్ మూవీ డోంత్ బ్రీత్ ను రీమేక్ చేసేందుకు సై అంటున్నాడు మన చియాన్. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బ్రామ్మన్ ఫేం సోక్రటీస్.. సేతుపతి చిత్రాన్ని తీసిన అరుణ్ కుమార్ లు చెప్పిన స్క్రిప్ట్ లకు కూడా పలు మార్పులతో ఓకే చేశాడట విక్రమ్. ఇవన్నీ కాకుండా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ సినిమా కూడా చేయనున్నాడు విక్రమ్. ఇలా వరుస సినిమాలతో ఎప్పుడూ లేనిది అభిమానులకు..ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాడు చియాన్!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus