విక్రమ్ స్కెచ్ వర్కవుటవుతుందా?

తెలుగువారికి అందునా ఆంధ్రులకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో “సంక్రాంతి” పండుగది ప్రధమ స్థానం. మూడురోజుల పాటు ఇంటిల్లపాది కుదిరినంతలో ఘనంగా జరుపుకొంటాం. ఇక సినిమా పిచ్చోళ్ళమైన మన తెలుగువారికి పండగ పూట సినిమా చూడకపోతే పండగను ఎంజాయ్ చేసినట్లే ఉండదు. అందుకే మూడురోజుల్లో ఎన్ని సినిమాలు విడుదలైతే అన్నీ చూసేసి సంతృప్తి చెందుతుంటారు. అందుకే మన దర్శకనిర్మాతలు కూడా సంక్రాంతికిని పురస్కరించుకొని ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదల చేయడానికి ఉత్సాహపడుతుంటాడు. ఎందుకంటే.. సినిమా బాగుంటే చాలు కుటుంబ సమేతంగా అందరూ చూసే ఏకైక సీజన్ కాబట్టి. అందుకే మన స్టార్ హీరోలందరూ సంక్రాంతికి తమ సినిమాలతో సిద్ధమైపోతుంటారు.

ఏ ఏడాది సంక్రాంతికి చిరంజీవి-బాలకృష్ణ పోటీపడి మరీ విజయం సాధించి ఇరువర్గాల అభిమానుల్ని అమితంగా ఆనందింపజేశారు. అయితే.. వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోల సంరంభం పతాక స్థాయికి చేరనుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ “అజ్ణాతవాసి”గా వస్తుండగా.. “జై సింహా” అంటూ బాలయ్య దౌడు తీస్తున్నాడు. వీరితోపాటు తమిళ కథానాయకుడు సూర్య కూడా “గ్యాంగ్”నేసుకొని వస్తున్నాడు. ఇక రాజ్ తరుణ్ కూడా ఆ పోటీలో “రాజుగాడు” కూడా ఉన్నాడని చెబుతున్నాడు. ఇప్పుడు మరో తమిళ కథానాయకుడు కూడా ఈ రేస్ లో నిలవనున్నాడు. అతనే విక్రమ్, పాపం ఎన్ని ప్రయోగాలు చేసిన, ఎంత కష్టపడినా సరైన ఫలితం లభించకపోవడంతో ఒక మాస్ మసాలా సినిమాతో సక్సెస్ సాధించాలనే తపనతో “స్కెచ్” అనే సినిమా చేస్తున్నాడు. ఊర మాస్ మసాలా ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తుండగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్రం విక్రమ్ కెరీర్ కు కీలకం కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus