Vikrant Rona Review: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 28, 2022 / 02:45 PM IST

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం “విక్రాంత్ రోణ”. తొలి చిత్రం “రంగి తరంగ”తోనే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ను కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. సినిమాలో స్పెషల్ సాంగ్ అయిన “రా రా రక్కమ్మ” తప్ప టీజర్ కానీ ట్రైలర్ కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కథ: కనీసం రోడ్డు దారి కూడా లేని ఓ కుగ్రామంలో పిల్లలు ఒక్కొక్కరిగా మిస్ అవుతుంటారు. వాళ్ళని వెతికేందుకు గవర్నమెంట్ నియమించిన పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ రోణ (సుదీప్). ఊరికి వచ్చిన విక్రాంత్.. అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి.. పిల్లల కిడ్నాప్ కి, ఊరి బయట జనానికి ఏదో సంబంధం ఉందని కనుగొంటాడు. ఈ క్రమంలో విక్రాంత్ ఎన్నో అపాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ కిడ్నాపుల కథ ఏమిటి? విక్రాంత్ ఎలా చేధించాడు? అనేది “విక్రాంత్ రోణ” కథాంశం.

నటీనటుల పనితీరు: సుదీప్ స్టైలిష్ గా, క్యారెక్టర్ నుంచి అస్సలు బయటకు రాకుండా విక్రాంత్ రోణగా సరిగ్గా సరిపోయాడు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం, ఇంట్రో ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

సుదీప్ సినిమాను తన భుజాల మోశాడనే చెప్పాలి.. ఎందుకంటే సినిమా మొత్తం ఆయనకు ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాల వరకు సోలో సీన్స్ ఉండడం గమనార్హం. జాక్వలిన్ ఒక చిన్న సీన్ & రక్కమ్మ సాంగ్ లో ఆకట్టుకుంది. మిగతా క్యాస్ట్ అంతా ఏదో ఉన్నారు అనిపించారు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. దర్శకుడు అనూప్ బండారి క్రియేట్ చేయాలనుకున్న మరో ప్రపంచాన్ని అత్యద్భుతంగా ఎలివేట్ చేశాయి ఈ రెండు విషయాలు. అజనీష్ లోకనాధ్ సంగీతం బాగుంది. నేపధ్య సంగీతం మాత్రం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. దర్శకుడు ఒక సాధారణ కథను పాన్ ఇండియన్ లెవల్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ గా చెప్పాలి. ఇదే సినిమాను ఓ కన్నడ సినిమాగా చూస్తే ఒక అద్భుతంగా ఫీల్ అయ్యేవాళ్లు.

ఎప్పుడైతే పాన్ ఇండియన్ సినిమా అన్నారో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను సినిమా అందుకోలేక.. యావరేజ్ గా మిగిలిపోయింది. అలాగే.. అనూప్ ట్విస్టులను రివీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ.. చివరివరకూ యాంటిసిపేషన్ మైంటైన్ చేయలేకపోయాడు. అలాగే.. ఎండింగ్ తో ఆడియన్స్ ను కూడా సాటిస్ఫై చేయలేకపోయాడు. సో, అనూప్ బండారి కథకుడిగా కంటే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

విశ్లేషణ: రొటీన్ సినిమాలకు భిన్నంగా.. కాస్త స్లోగా, ఆసక్తికరంగా సాగే చిత్రం “విక్రాంత్ రోణ”. సుదీప్ నటన & ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ కోసం ఈ చిత్రాన్ని ట్రై చేయొచ్చు. అయితే.. పాన్ ఇండియన్ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ తో మాత్రం వెళితే నిరాశచెందడం ఖాయం.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus