మెగా పవర్ స్టార్ రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న(నిన్న) విదులయ్యింది. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాంచరణ్ నుండీ వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఈ చిత్రానికి దాదాపు 94.10 కోట్ల బిజినెస్ జరిగింది.
అయితే ఈ చిత్రం మొదటి షో నుండీ ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ చిత్రం చూసిన మెగా ఫ్యాన్సే పెదవి విరుస్తుండడం గమనార్హం. రాంచరణ్ సెంటిమెంట్, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు.. అందులో సందేహం లేదు. విలన్ వివేక్ ఒబెరాయ్ కూడా కరెక్ట్ సరిపోయాడు.. కానీ విలన్ ని హైలెట్ చేయాలనే ఉద్దేశంతో బోయపాటి… ‘అతి ఓవర్లోడ్’ అయ్యిందనే ఫీలింగ్ వచ్చిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘రంగస్థలం’ వంటి చిత్రం తర్వాత చరణ్ నటించిన చిత్రం కావడంతో.. మొదటి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం 30.64 కోట్ల షేర్ ను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం- 5.08 కోట్లు
వైజాగ్- 2.47 కోట్లు
ఈస్ట్ – 2.05 కోట్లు
వెస్ట్- 1.83 కోట్లు
కృష్ణ- 1.59 కోట్లు
గుంటూరు- 4.18 కోట్లు
నెల్లూరు- 1.69 కోట్లు
సీడెడ్- 7.20 కోట్లు
——————————-
ఏపీ & టీఎస్ కలెక్షన్స్- 26.09 కోట్లు
———————————
కర్ణాటక – 4.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.45 కోట్లు
————————————————
వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 10.5 కోట్లు (షేర్) – 17 కోట్లు (గ్రాస్)
——————————————————-