‘వినయ విధేయ రామా’ ప్రీ -రిలీజ్ వేడుక ప్లేస్ ఫిక్సయ్యింది..!

రాంచరణ్ -బోయపాటి కాంబినేషన్లో తెరెక్కుతున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామా’. డీ.వీ.వీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీ.వీ.వీ. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడు గా కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 26 కు షూటింగ్ మొత్తం పూర్తవ్వబోతుందని చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిసెంబర్ 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను జరుపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకలోనే ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో స్నేహా, కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు 12 వ చిత్రం కావడం విశేషం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus