ఇబ్బంది పడుతున్న వినాయక్!!!

  • July 4, 2016 / 11:24 AM IST

సినిమా పరిశ్రమలో దాదాపుగా టాప్ పొసిషన్ లో ఉన్న మెగా స్టార్ చిరంజీవి ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ పెద్దగా కలసి రాకపోవడంతో మళ్ళీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే చిరు 150 వ చిత్రంగా తెరకెక్కించేందుకు ఎన్ని కధలను విన్న మెగా స్టార్ చివరకు ఫక్తు కమర్షియల్ ఫార్మ్యాట్ తో ఉన్న తమిళ సినిమా రీమేక్ చేసేందుకు సిద్దం అయిపోయిన విషయం తెలిసిందే. ఇక అదే క్రమంలో ఈ సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నాడు మన దర్శకుడు వినాయక్.

ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాల్ పుణ్యమా అని వినాయక్ చిరు కుమారుడు, ఈ సినిమా నిర్మాత రామ్‌చరణ్ పై చాలా అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఏమయ్యింది అంటే…ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం….‘కత్తి లాంటోడు’ షూటింగ్ స్పీడ్ గా జరుగుతూ ఉండటంతో అప్పుడే బయ్యర్ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరిందని టాక్. అయితే ఎంత 150వ సినిమా అయినా, ఎంత సినిమాకు భారీ క్రేజ్ ఉన్నా ఈ సినిమాకు లిమిట్ ఉంటుంది అన్న విషయం మరిచాడు చెర్రీ…అందుకే తన వద్దకు వచ్చిన ఓవెర్సీస్ బయ్యర్స్ కు చుక్కలు కనిపించే రేంజ్ రేట్ చెప్పడంటా.

ఈ సినిమా ఓవర్సీస్ రేట్స్ ఇంచు మించు ‘బాహుబలి’ ఓవర్సీస్ రేట్లతో సమానంగా చరణ్ చెపుతూ ఉండటంతో ఆ ఫిగర్స్ విని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నోట మాట రాక మైండ్ బ్లాక్ అయినట్లు టాక్. ఇక ఇదే విషయమై వినాయక్ చాలా అసహనంతో ఉన్నాడని టాక్. చిరంజీవి 9 సంవత్సరాల తరువాత నటిస్తున్న సినిమాకు ఓవర్సీస్ లో ఎక్కువ లాభాలు వస్తాయి అని అనుకోవడం దురాశ అని వినాయక్ అంటున్నాడు. నిజమే ఎంత మెగా స్టార్ అయినా మార్కెట్ లేకపోతే….కష్టమే మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus