వర్జిన్ భానుప్రియ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 17, 2020 / 05:53 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “వర్జిన్ భానుప్రియ”. థియేట్రికల్ రిలీజ్ కుదరకపోవడంతో జీ5 యాప్ లో విడుదలైందీ చిత్రం. ఈ బీ గ్రేడ్ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కథ: అసలు సినిమా కథ ఏమిటా అని ఆఖరివరకి ఓపిగ్గా సినిమా చూసినా అర్ధం కాదు. భానుప్రియ అలియాస్ వర్జిన్ భానుప్రియ (ఊర్వశి రౌటేలా) 25 ఏళ్ళు నిండినా కన్యగానే మిగిలిపోతుంది. తన కన్యాత్వాన్ని (వర్జీనిటీ) కోల్పోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నాలు ఫలించాయా? భానుప్రియ వర్జీనిటీని వదిలించుకోగలిగిందా లేదా అనేది “వర్జిన్ భానుప్రియ” కథ.

నటీనటుల పనితీరు: తక్కువ బడ్జెట్ లో సినిమాను తీయాలి అనే ఆలోచనతో సినిమా మొత్తాన్ని సీరియల్ ఆర్టిస్టులతోనే నింపేశారు. రెండు గంటల సినిమా కూడా సీరియల్ చూసిన భావన కలగడానికి ముఖ్యకారణం క్యాస్టింగ్. వర్జిన్ భానుప్రియ అనే టైటిల్ వినగానే అందరూ ఊర్వశిని హాట్ గా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆనీ.. ఈ సినిమాలో అమ్మడు హాట్ సీన్స్ చేయడం పక్కన పెడితే కనీసం గ్లామ్ సీన్స్ కూడా చేయలేదు. దాంతో ఆమె కోసం సినిమా చూసే ఆడియన్స్ మాత్రం తీవ్ర నిరాశ చెందుతారు. ఇక మిగతా పాత్రధారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. వారి పాత్రలే కాదు వారి నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది.

సాంకేతికవర్గం పనితీరు: అసలు సినిమా తీయడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని ఒక టీం అందరూ కలిసి తీసిన సినిమాలా ఉంటుంది “వర్జిన్ భానుప్రియ”. దర్శకుడు రానుకున్న కథ-కథనంలో విషయం ఎక్కడుందా అని భూతద్ధం పెట్టి వెతికినా ఏమీ దొరకదు. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్, డిఐ వంటివన్నీ కూడా పేలవంగా ఉంటాయి. కేవలం టైటిల్ & హీరోయిన్ హాట్ ఇమేజ్ ను బేస్ చేసుకొని తీసిన బేస్ లెస్ ఫిలిమ్ “వర్జిన్ భానుప్రియ”. ఆడియన్స్ ఏం తీసినా చూస్తారు, కేవలం వాళ్ళని పోస్టర్లతో మోసం చేయగలమని భావించిన బృందం తీసిన బీ గ్రేడ్ సినిమా ఇది. ఒక క్యారెక్టర్ ఆర్క్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, కథనం కానీ లేకుండా ఈమధ్యకాలంలో చూసిన ఏకైక సినిమా ఇదే. థియేటర్లలో విడుదలై ఉంటే కనీసం ఒక్కరోజు కూడా నిలబడలేని కంటెంట్ తో ఈ సినిమాను అసలు ఎందుకు ప్రొడ్యూస్ చేశారో కూడా అర్ధం కాదు.

విశ్లేషణ: ఏదో ఊహించికొని మాత్రం ఈ సినిమాను చూడడం కంటే పెద్ద మిస్టేక్ మరొకటి ఉండదు. అంతగా ఊర్వశి అందాలు ఆస్వాదించాలంటే యూట్యూబ్ లో ఆమె వీడియోలు చూడడం చాలా బెటర్. అంతే తప్ప ఈ వర్జిన్ భానుప్రియ జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus