పందెం కోడి సీక్వెల్ హిట్ అయిన ఆనందంలో ప్రకటన చేసిన విశాల్

పందెం కోడి సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుకున్నమూవీ పందెం కోడి 2. విశాల్ హీరోగా ఎన్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 18 న రిలీజ్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయి మంచి కలక్షన్స్ రాబడుతోంది. విశాల్, కీర్తి సురేష్ రొమాన్స్ తో పాటు వరలక్ష్మి నటన ఈ సినిమాకి ప్లస్ అయింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్, అక్షయ్ లతో కలిసి విశాల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో 6 కోట్లకి కొనుగోలు చేస్తే, 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకి పైగా షేర్ ను రాబట్టింది. తమిళంలోనూ లాభాలను అందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో మీడియా ముందుకు వచ్చిన విశాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. “పందెం కోడి’ సినిమాలు నాకు బాగా కలిసొచ్చాయి.

‘పందెం కోడి 3’ని కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నాను. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని లింగుస్వామికి ఆల్రెడీ చెప్పేశాను” అని విశాల్ వెల్లడించారు. కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. “మహానటి’ తర్వాత ఒక మాస్ రోల్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అదృష్టం కొద్దీ నాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. మాస్ రోల్ చాలా బాగా చేశానని అంతా అంటూ ఉంటే సంతోషంగా ఉంది ” అని వెల్లడించింది. మరి “పందెం కోడి 3 ” లోను కీర్తి సురేష్ నే హీరోయిన్ గా పెట్టుకుంటారా? లేదా? అనే విషయంలో విశాల్ క్లారిటీ ఇవ్వలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus