యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 15, 2019 / 04:59 PM IST

మాస్ హీరో విశాల్ నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ “యాక్షన్”. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఐశ్వర్య లేక్ష్మి, తమన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సుందర్.సి దర్శకుడు. మరి విశాల్ & సుందర్.సి ల కాంబినేషన్ ఈసారి ఎలాంటి హిట్ కొట్టిందో చూద్దాం..!!

కథ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండో కుమారుడు మరియు ఆర్మీ లెఫ్టినెంట్ అయిన సుభాష్ (విశాల్) తన అన్నయ్య (రాంకీ) మరియు నేషనల్ లెవల్ లీడర్ గుప్తాజీ హత్యకు కారణం కనుక్కోనే పనిలో భాగంగా.. పలువుర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్నది పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయిన మాలిక్ (కబీర్ దుహాన్ సింగ్) అని తెలుసుకొంటాడు. పాకిస్తాన్ నుండి మాలిక్ ను ఇండియా తీసుకురావడమే లక్ష్యంగా మొదలైన సుభాష్ ప్రయాణం ఎలా సాగింది? అతడికి సహాయంగా దియా (తమన్నా) ఎలా నిలిచింది? అనేది కథాంశం.

నటీనటుల పనితీరు: యాక్షన్ రోళ్స్ చేయడం విశాల్ కు కొత్తేమీ కాదు. ఈ సినిమాలోనూ మిలటరీ అధికారిగా యాక్షన్ బ్లాక్స్ లో అదరగొట్టాడు. అతడి పాత్రకు జనాలు బాగా కనెక్ట్ అవుతారు. తమన్నా ఈ చిత్రంలో నటిగానే కాక గ్లామర్ తోనూ ఆకట్టుకొంది. పాటల్లో సూపర్ హాట్ గా కనిపించిన మిల్ వైట్ బ్యూటీ, యాక్షన్ సీన్స్ లోనూ చక్కగా నటించింది. నెగిటివ్ రోల్లో ఆకాంక్ష పూరీ గ్లామర్ షో మరియు ఆమె చేసిన యాక్షన్ సీన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. కబీర్ దుహాన్ సింగ్ ఎప్పట్లానే విలనిజాన్ని బాగా పండించాడు. మిగతా సహాయ పాత్రల్లో తమిళ నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: డబ్బింగ్ పరంగా తీసుకొన్న జాగ్రత్త ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఎక్కడో కొన్ని సన్నివేశాల్లో తప్పితే.. చాలా వరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ ను కలిగిస్తుందీ చిత్రం. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న సినిమా కావడంతో ప్రొడక్షన్ డిజన్ విషయంలో తీసుకొన్న జాగ్రత్త కూడా బాగుంది.

దర్శకుడు సుందర్.సి చాలా సన్నివేశాలు కొన్ని జపనీస్ మరియు కొరియన్ సినిమాల నుంచి లేపేసినప్పటికీ.. వాటిని నేటివిటీకి తగ్గట్లుగా కంపోజ్ చేసుకున్న విధానం ప్రశంసనీయం. యాక్షన్ సినిమాలో లాజిక్స్ కూడా కుదిరాయి. చేజ్ సీక్వెన్స్ మరియు యాక్షన్ బ్లాక్స్ గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది.అయితే.. పాకిస్తాన్ తీవ్రవాదిని ఇండియా తీసుకురావడం అనే కాన్సెప్ట్ ను ఇప్పటికే చాలా హిందీ సినిమాలతోపాటు.. రీసెంట్ గా వచ్చిన “చాణక్య”లోనూ చూసి ఉండడంతో కథనం వేగవంతంగా ఉన్నా.. పెద్ద ఆసక్తికరంగా మాత్రం ఉండదు. ఇక మూల కథ మరియు కొన్ని ట్విస్టులు సేమ్ టు సేమ్ “చాణక్య” సినిమాలోవి కావడం, ఆ చిత్ర దర్శకుడు తిరు హీరో విశాల్ కి స్నేహితుడు కావడమే కాక ఇదివరకు విశాల్ తో “ఇంద్రుడు, వేటాడు వెంటాడు” వంటి సినిమాలు తెరకెక్కించి ఉండడంతో హెల్ప్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ చిన్నపాటి మైనస్ లు తీసేస్తే.. యాక్షన్ & మాస్ మసాలా మూవీ లవర్స్ “యాక్షన్” సినిమాను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.

విశ్లేషణ: బోలెడన్ని యాక్షన్, చేజ్ సీన్లు, తమన్నా, ఆకాంక్ష పూరీ గ్లామర్, ఫారిన్ లొకేషన్స్ అన్నీ కలగలిపి “యాక్షన్” చిత్రాన్ని మంచి టైమ్ పాస్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఈ వీకెండ్ విన్నర్ విశాల్ అని కన్ఫర్మ్ చేసేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus